Narada Case: సుప్రీంకు సీబీఐ

తాజా వార్తలు

Published : 24/05/2021 10:07 IST

Narada Case: సుప్రీంకు సీబీఐ

దిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ తుపానుకు కారణమైన తృణమూల్‌ మంత్రుల అరెస్టు వ్యవహారం సుప్రీంకు చేరింది. ఈ కేసులో అరెస్టయిన టీఎంసీ మంత్రులు, మరో ఇద్దరు నేతలను గృహనిర్బంధంలో ఉంచాలన్న కోల్‌కతా హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ నలుగురు నేతల బెయిల్‌ పిటిషన్‌పై నేడు కోల్‌కతా హైకోర్టు విస్తృత ధర్మాసనం విచారణ జరపనుంది. ఈ విచారణను రద్దు చేయాలని సీబీఐ తన పిటిషన్‌లో కోరింది. సీబీఐ అభ్యర్థనపై సర్వోన్నత న్యాయస్థానం నేడు విచారణ చేపట్టనుంది.  

నారదా కుంభకోణం వ్యవహారంలో రాష్ట్ర మంత్రులు ఫిర్హాద్‌ హకీం, సుబ్రతా ముఖర్జీ, టీఎంసీ ఎమ్మెల్యే మదన్‌ మిత్రా, తృణమూల్‌ మాజీ నాయకుడు సోవన్‌ ఛటర్జీలను గత సోమవారం సీబీఐ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీంతో మధ్యంతర బెయిల్‌ కోరుతూ ఈ నలుగురు కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై గత శుక్రవారం హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం విచారణ జరపగా.. తీర్పుపై న్యాయమూర్తుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో ప్రస్తుతానికి ఈ నలుగురు నేతలను గృహనిర్బంధంలో ఉంచాలని ధర్మాసనం ఆదేశించింది. వీరి బెయిల్‌ పిటిషన్లను విస్తృత ధర్మాసనానికి పంపుతున్నట్లు తెలిపింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ సీబీఐ నేడు సుప్రీంకోర్టును ఆశ్రయించింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని