TS News: ఉచిత బియ్యం పంపిణీ చేయాలి: కిష‌న్ రెడ్డి

తాజా వార్తలు

Published : 30/05/2021 01:33 IST

TS News: ఉచిత బియ్యం పంపిణీ చేయాలి: కిష‌న్ రెడ్డి

హైద‌రాబాద్‌: కేంద్ర ప్ర‌భుత్వం పేద ప్ర‌జ‌ల‌కు అంద‌జేస్తున్న‌ ఐదు కిలోల ఉచిత బియ్యం కార్య‌క్ర‌మాన్ని తెలంగాణ‌లో అమ‌లు చేయాల‌ని కేంద్ర హోంశాఖ స‌హాయ మంత్రి కిష‌న్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. దేశంలోని 80 కోట్ల మందికి మేలు చేసేలా కేంద్రం తీసుకొచ్చిన‌ గ‌రీబ్ క‌ళ్యాణ్ అన్న యోజ‌న కార్య‌క్ర‌మం కింద ఉచిత ఆహార ధాన్యాలు పంపీణీ చేస్తున్న‌ట్లు పేర్కొన్నారు. గ‌త సంవ‌త్స‌రం అర్హులైన ల‌బ్ధిదారులంద‌రికీ ఐదు కిలోల చొప్పున ధాన్యాన్ని ఉచితంగా ఇచ్చిన‌ట్లు కిష‌న్‌రెడ్డి తెలిపారు. క‌రోనా వైర‌స్ మ‌ళ్లీ విజృంభిస్తున్న నేప‌థ్యంలో మే- జూన్ మాసాల‌కు ఉచితంగా ఆహార ధాన్యాల‌ను కేంద్రం అందిస్తున్న‌ట్లు లేఖ‌లో పేర్కొన్నారు. తెలంగాణ‌లో ఈ కార్య‌క్ర‌మంలో జ‌రుగుతున్న జాప్యాన్ని అరిక‌ట్టాల‌ని ఆయ‌న‌ డిమాండ్ చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని