ఎందుకీ ఎన్నికలు: చంద్రబాబు

తాజా వార్తలు

Updated : 17/04/2021 13:52 IST

ఎందుకీ ఎన్నికలు: చంద్రబాబు

తిరుపతి: పోలీసులు, ఎన్నికల అధికారులు, వాలంటీర్లు కుమ్మక్కై ఎన్నికలను ప్రహసనంగా మర్చేశారని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... అప్రజాస్వామికంగా నిర్వహిస్తున్న ఈ ఎన్నికలు ఎందుకని ప్రశ్నించారు.

‘‘స్థానికేతరుడైన మంత్రి పెద్దిరెడ్డి  రామచంద్రారెడ్డి తిరుపతిలో ఎందుకు ఉన్నారు. తిరుపతిలో స్థానికులు ఓట్లు వేయకుండా అడ్డుకున్నారు. పోలీసులు, అధికారులు ప్రజాస్వామ్యం కోసం పనిచేయాలి. కానీ, వైకాపా కోసం పనిచేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వేలమంది వస్తే పోలీసులు ఏం చేస్తున్నారు. సరిహద్దులు మూసేసి తనిఖీలు చేసి పంపించాల్సింది. కానీ, చెక్‌పోస్టులను పోలీసులు ఎందుకు ఎత్తేశారు. భాజపా నాయకులు శాంతారెడ్డి దొంగ ఓటర్లను పట్టుకున్నారు. దొంగ ఓటర్లను పట్టుకున్న తెదేపా నేతలను అరెస్టు చేశారు. ఇదెక్కడి ప్రజా స్వామ్యం. ఇతర ప్రాంతాల నుంచి వందల మందిని తీసుకొచ్చి పర్యాటకులు అంటున్నారు. వెబ్‌ కాస్టింగ్‌ నిర్వహణ ఏమైంది. అన్ని అక్రమాలపై ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలి. పోలీసులు, అధికారులు ఉన్నది జగన్‌ అనే వ్యక్తి కోసం కాదు. ఇవాళ తిరుపతిలో ప్రజా స్వామ్యం అపహాస్యం పాలైంది. బందిపోట్లను తలపించేలా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. ప్రతిపక్షాలు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చూస్తుంటే.. వైకాపా మాత్రం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. పోలీసులు, పోలింగ్‌ సిబ్బంది ఏకపక్షంగా వ్యవహరించారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైంది. వైకాపా అరాచకాలు ఖండిస్తున్నా. వైకాపా అక్రమాలపై ఈసీకి అన్ని ఆధారాలు సమర్పిస్తాం. వైకాపా అక్రమాలను బయటపెట్టిన తెదేపా శ్రేణులను అభినందిస్తున్నా. ప్రజాస్వామ్యంపై నమ్మకం కలిగించాల్సిన బాధ్యత ఈసీపై ఉంది. తిరుపతి ఉప ఎన్నికను పూర్తిగా రద్దు చేయాలి. పూర్తిగా కేంద్ర బలగాలు, సిబ్బందితో ఎన్నికలు నిర్వహించాలి’’ అని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని