close

తాజా వార్తలు

Updated : 20/04/2021 15:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

CM KCR కోలుకోవాలంటూ అంజన్నకు ముడుపు

జగిత్యాల: సీఎం కేసీఆర్‌ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలంటూ తెరాసకు చెందిన చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ ఆంజనేయస్వామికి ముడుపు కట్టారు. ఈ మేరకు ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులకు ఎమ్మెల్యే ముడుపు సమర్పించారు.

కేసీఆర్‌ ప్రస్తుతం తన వ్యవసాయ క్షేత్రంలో హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ప్రత్యేక వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది. సీఎం ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలని వివిధ రాజకీయ పార్టీల నేతలు, పలువురు ప్రముఖులు ఆకాంక్షించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని