మమత ఆరోపణలతో షాకయ్యా! 

తాజా వార్తలు

Published : 29/06/2021 01:40 IST

మమత ఆరోపణలతో షాకయ్యా! 

కోల్‌కతా: బెంగాల్‌ గవర్నర్‌, సీఎం మమత మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. గవర్నర్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ అవినీతిపరుడని, 1996 హవాలా కేసు ఛార్జి షీట్‌లో ఆయన పేరు ఉందంటూ మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను గవర్నర్‌ తిప్పికొట్టారు. సీఎం స్థాయి వ్యక్తి ఇలాంటి తప్పుడు, అసత్య ఆరోపణలు చేస్తారని తానెప్పుడూ ఊహించలేదన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఆమె చేసిన ఆరోపణల నేపథ్యంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఏ ఛార్జిషీట్‌లోనూ నాపేరు లేదు. ఏ కోర్టు నుంచి కూడా నేను స్టే తీసుకోలేదు. సీఎం మమత నుంచి ఇలాంటి ఆరోపణలు ఊహించలేదు. ఆమె ఆరోపణల్లో నిజం లేదు. తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం, వాస్తవాలను వక్రీకరించడం దురదృష్టకరం. సీఎం స్థాయి వ్యక్తికి ఇలాంటివి తగవు’’ అన్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని