Rahul Gandhi: మరిన్ని ఉత్పరివర్తనాలకు అవకాశం ఇవ్వొద్దు

తాజా వార్తలు

Published : 29/05/2021 01:40 IST

Rahul Gandhi: మరిన్ని ఉత్పరివర్తనాలకు అవకాశం ఇవ్వొద్దు

కేంద్ర ప్రభుత్వానికి రాహుల్‌ సూచన

దిల్లీ: దేశవ్యాప్తంగా ప్రజలందరికీ కరోనా టీకా అందించేందుకు సరైన వ్యాక్సినేషన్‌ ప్రణాళిక  సిద్ధం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ సూచించారు. ఒకవేళ ఈ విషయంలో విఫలమైతే భారత్‌పై మరిన్ని కరోనా వేవ్‌లు విరుచుకుపడతాయని హెచ్చరించారు. లాక్‌డౌన్‌, భౌతిక దూరం, మాస్కులు ధరించడం వంటి నియమాలు వైరస్‌ను కట్టడి చేసేందుకు తాత్కాలిక చర్యలు మాత్రమేనన్నారు. ప్రజలందరికీ వ్యాక్సిన్‌ అందించడం ఒక్కటే మహమ్మారిని పారదోలేందుకు మార్గమని హితవు పలికారు. శుక్రవారం వర్చువల్‌గా జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

వైరస్‌కు రూపాంతరం చెందే అవకాశం ఇవ్వొద్దని.. ఆలోపే అందరికీ టీకాలు అందించాలని కేంద్ర ప్రభుత్వానికి రాహుల్‌ గాంధీ సూచించారు. ఇప్పటి వరకు కేవలం మూడు శాతం మందికి మాత్రమే టీకాలు అందాయన్నారు. ఏ తరహా శక్తితో పోరాడుతున్నారో ప్రభుత్వానికి అర్థం కావడం లేదని విమర్శించారు. వైరస్‌ ఉత్పరివర్తనాల వల్ల తలెత్తే ముప్పు కూడా యంత్రాంగానికి అర్థం కావడం లేదన్నారు. భారత్‌లో ఇప్పటి వరకు సంభవించిన మరణాలకు ప్రధాని మోదీతో కూడిన కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత అని దుయ్యబట్టారు.

ప్రధాని చర్యలే రెండో వేవ్‌ విరుచుకుపడడానికి కారణమని రాహుల్‌ ఆరోపించారు. మోదీకి అసలు కొవిడ్‌ అంటేనే అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. ప్రధానిని ఒక ఈవెంట్‌ మేనేజర్‌గా అభివర్ణించిన రాహుల్‌ భారత్‌లో జరిగే ప్రతి అంశాన్ని ఆయన ఓ ఈవెంట్‌లాగే పరిగణిస్తారని మండిపడ్డారు. భారత్‌లో మరణాల రేటు తప్పుల తడకగా ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని చర్యలు తీసుకోవాలని హితవు పలికారు.

కొవిడ్‌ మరణాల విషయంలో ఎలాంటి తప్పుడు లెక్కలు నివేదించొద్దని కాంగ్రెస్‌ పాలిత రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్యమంత్రులకు సూచించినట్లు రాహుల్‌ తెలిపారు. మరణాల సంఖ్య కలిచివేసే విధంగా ఉన్నప్పటికీ.. నిజాలు మాత్రమే వెల్లడించాలని తెలిపినట్లు పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని