TS News: ఎన్నికుట్రలు చేసినా భయపడం: ఈటల జమున

తాజా వార్తలు

Updated : 30/05/2021 12:37 IST

TS News: ఎన్నికుట్రలు చేసినా భయపడం: ఈటల జమున

హైదరాబాద్‌:  తమ హేచరీస్‌, గోదాములపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ సతీమణి జమున ఆరోపించారు. అసత్య ప్రచారాలు తిప్పికొట్టడం తమకు తెలుసన్నారు. హైదరాబాద్‌ శివారు శామీర్‌పేటలోని నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జమున మాట్లాడారు. తాము కష్టపడి పైకొచ్చామని.. ఎవరినీ మోసం చేయలేదన్నారు.  ప్రణాళిక ప్రకారం పోలీసులతో భయభ్రాంతులకు గురిచేశారని ఆమె ఆరోపించారు.

ఒక్క ఎకరం ఎక్కువున్నా ముక్కు నేలకు రాస్తా

‘‘మెదక్‌ జిల్లా మాసాయిపేటలో 46 ఎకరాలు కొనుగోలు చేశాం. ఒక్క ఎకరం ఎక్కువగా ఉన్నా ముక్కు నేలకు రాస్తా.. సర్వే చేసిన అధికారులు ముక్కు నేలకు రాస్తారా?మా స్థలంలో ఏర్పాటు చేసిన పత్రికలోనే దుష్ప్రచారం చేయడం బాధాకరం. 1992లో దేవరయాంజల్‌ వచ్చి 1994లో అక్కడి భూములు కొన్నాం. మా గోదాములు ఖాళీ చేయించి ఆర్థికంగా దెబ్బతీయాలని చూస్తున్నారు. అసత్య ప్రచారాలు ఎక్కువ రోజులు నిలవలేవు. ఎన్ని కుట్రలు చేసినా భయపడేది లేదు. మేం ఎవరికీ అన్యాయం చేయలేదు.. దోపిడీ చేయలేదు. ఎప్పటికైనా న్యాయం గెలుస్తుంది.. ధర్మం నిలబడుతుంది.

పౌల్ట్రీ అమ్ముకొని ఉద్యమం కోసం ఖర్చు చేశాం

సర్వే చేయొద్దని మేం చెప్పలేదు. మా సమక్షంలో సర్వే చేయాలని చెప్పాం. మంత్రులు కూడా దొంగచాటుగా కలవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఉద్యమం వదిలి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వెంట నడవాలని అప్పట్లో మాపై ఒత్తిళ్లు వచ్చాయి. అప్పటి మంత్రి రత్నాకర్‌రావు చాలా సార్లు చెప్పారు.. కానీ మేం వెళ్లలేదు. కుల రహిత సమాజం కావాలని కోరుకుంటున్నాం. సమైక్య పాలనలో కులాలు చూడలేదు.. ఇప్పుడు కులాలతో విభజన చేస్తున్నారు. మాకు అన్ని కులాలూ సమానమే. అందరికీ స్వేచ్ఛ కావాలి.. ఆర్థికంగా ఎదగాలి. అన్ని కులాలు ఉద్యమం చేస్తేనే తెలంగాణ వచ్చింది. రాష్ట్రం ఏర్పడ్డాక అవమానాలు పెరిగాయి. పౌల్ట్రీ అమ్ముకొని ఉద్యమం కోసం ఖర్చు చేశాం’’ అని జమున అన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని