స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై కేంద్రానికి గల్లా లేఖ

తాజా వార్తలు

Updated : 06/02/2021 15:31 IST

స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై కేంద్రానికి గల్లా లేఖ

అమరావతి: విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటు పరం చేయాలన్న నిర్ణయంపై పునరాలోచన చేయాలని తెదేపా పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్‌ కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌కు విడివిడిగా లేఖలు రాశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంస్థ కార్మికులనే కాదు.. మొత్తం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. విశాఖపట్నంలో ఉక్కు కర్మాగారం కోసం ఎంతో మంది త్యాగం చేశారని, ప్రజల పోరాటం ద్వారా ఈ ప్రాజెక్టు వచ్చిందని గుర్తుచేశారు.

మొత్తం ఉక్కు రంగమే అనేక ఒడుదొడుకులను ఎదుర్కొంటోందని, మార్కెట్‌ ఒత్తిడిని ఎదుర్కోలేకపోతోందని గల్లా జయదేవ్‌ అభిప్రాయపడ్డారు. ఒక్క విశాఖ ప్రాజెక్టుకే ఇది వర్తించదని జయదేవ్‌ అన్నారు. ఆర్థిక మందగమనం ఉన్న తరుణంలో ఇలాంటి సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ ఆర్థిక రంగానికి మంచిది కాదన్నారు. ప్రైవేటుపరం చేయడానికి బదులు కర్మాగారానికి ప్రత్యేక గనులు కేటాయించాలని కోరారు. సంస్థ రుణాలను ఈక్విటీలుగా, ప్రాధాన్యత షేర్లుగా మర్చేలా చేయడం ద్వారా అప్పుల ఊబి నుంచి బయటపడేలా చేయాలని కేంద్ర మంత్రులను కోరారు.

ఇవీ చదవండి..

అలాంటి అధికారులకు బ్లాక్‌లిస్టే: మంత్రి పెద్దిరెడ్డి ప్రైవేటీకరణ నిర్ణయం ఒక్కరోజుది కాదు: సుజనా

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని