బుగ్గనపై రూ.10కోట్ల పరువునష్టం దావావేస్తా

తాజా వార్తలు

Published : 07/01/2020 00:28 IST

బుగ్గనపై రూ.10కోట్ల పరువునష్టం దావావేస్తా

మాజీ మంత్రి రావెల

విజయవాడ: తన మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆరోపణలు చేసిన ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డిపై రూ.10కోట్ల పరువు నష్టం దావా వేయనున్నట్లు భాజపా నేత, మాజీ మంత్రి రావెల కిశోర్‌ బాబు తెలిపారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని అమరావతిని తరలించేందుకు పెద్ద కుట్ర జరుగుతోందని ఆరోపించారు. అందులో భాగంగానే తనకు రాజధాని ప్రాంతంలో భూములున్నాయని వైకాపా నేతలు ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. బినామీ భూములున్నాయంటూ..రాజధానిని తరలించాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రానికి ఒక అడ్రస్‌ లేకుండా చేస్తున్నారని విమర్శించారు. రాజధాని అమరావతిని 5 కోట్ల ఆంధ్రుల అభివృద్ధికి, భవిష్యత్‌కు చిరునామాగా ఆయన అభివర్ణించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని