‘మాన్సాస్‌’ఛైర్‌పర్సన్‌గా సంచయత గజపతిరాజు

తాజా వార్తలు

Updated : 04/03/2020 19:39 IST

‘మాన్సాస్‌’ఛైర్‌పర్సన్‌గా సంచయత గజపతిరాజు

అశోక్‌గజపతిని తొలగించిన రాష్ట్ర ప్రభుత్వం

విజయనగరం: విజయనగరం జిల్లాలోని ప్రఖ్యాత మాన్సాస్‌ ట్రస్ట్‌ వ్యవహారంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ట్రస్ట్‌కు నిన్నటి వరకు తెదేపా సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్‌ గజపతిరాజు ఛైర్మన్‌గా కొనసాగగా.. ఊహించని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను తొలగించింది. అశోక్‌ గజపతి స్థానంలో ఆయన సోదరుడు ఆనంద గజపతి రాజు రెండో కుమార్తె సంచయత గజపతి రాజును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో సంచయత మాన్సాస్‌ ట్రస్ట్‌ ఛైర్‌పర్సన్‌గా ప్రమాణస్వీకారం చేసి లాంఛనంగా బాధ్యతలు స్వీకరించారు. 

మాన్సాస్‌ ట్రస్ట్‌ కింద 108 ఆలయాలు, 14,800 ఎకరాల భూములు ఉన్నాయి. ట్రస్ట్‌ ఛైర్‌పర్సన్‌గా ప్రమాణస్వీకారం చేసిన సంచయత.. దిల్లీ భాజపా అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నారు. ఊహించని విధంగా ఆమె ఈరోజు మధ్యాహ్నం ప్రమాణస్వీకారం చేయడంతో మాన్సాస్‌ ట్రస్ట్‌ సభ్యులు, అధికారులే కాకుండా తెదేపా శ్రేణులు విస్మయానికి గురయ్యాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని