Gupkar Alliance: ప్రధాని అధ్యక్షతన సమావేశం
close

తాజా వార్తలు

Published : 22/06/2021 23:08 IST

 Gupkar Alliance: ప్రధాని అధ్యక్షతన సమావేశం

పాల్గొననున్న కశ్మీరీ ప్రధాన నేతలు

శ్రీనగర్: గురువారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే అఖిలపక్ష సమావేశంలో పాల్గొననున్నట్లు పీపుల్స్‌ అలయన్స్‌ ఫర్ గుప్కర్ డిక్లరేషన్‌(పీఏజీడీ) ప్రకటించింది. ఆ సమయంలో తమ అజెండాను ప్రధాని ముందు ఉంచనున్నట్లు వెల్లడించింది. రెండురోజుల్లో జరగనున్న ఈ సమావేశంలో జమ్మూకశ్మీర్ సమస్యలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించాక ఏర్పడిన రాజకీయ ప్రతిష్టంభనను అంతం చేయడానికి అఖిలపక్ష సమావేశం కీలకంగా మారనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే జమ్మూకశ్మీర్ ప్రత్యేక హోదాను పునరుద్ధరించడం గురించి కూడా చర్చిస్తారనే ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. మరోపక్క తమకు సమావేశానికి పిలుపు అందిందని అక్కడి నేతలు కొందరు వెల్లడించిన సంగతి తెలిసిందే. 

ఇదిలా ఉండగా.. ప్రధాని ఆహ్వానంపై గుప్కర్ నేతలు సమావేశమై చర్చించారు. ‘నాతోపాటు పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, ఎండీ తరిగామి సాహిబ్ ఈ సమావేశానికి హాజరవుతారు. ప్రధాని, హోంమంత్రి ముందు మా అజెండాను వెల్లడించనున్నాం’ అని ఈ సందర్భంగా నేషనల్ కాన్ఫరెన్స్ అగ్రనేత పరూఖ్ అబ్దుల్లా మీడియాకు వెల్లడించారు. ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలనే డిమాండ్‌తో జమ్మూకశ్మీర్‌లోని ప్రధాన పార్టీలన్నీ ఏకమై కూటమిగా ఏర్పడ్డాయి. దానికి ‘పీపుల్స్ అలయన్స్‌ ఫర్ గుప్కర్ డిక్లరేషన్‌(పీఏజీడీ) అని నామకరణం చేశాయి. పరూఖ్ అబ్దుల్లా ఈ కూటమికి నేతృత్వం వహిస్తున్నారు. ఆగస్టు 2019లో కేంద్రం జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేసిన సంగతి తెలిసిందే.   


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని