‘ఏందయ్యా ఈ అరాచకం.. నేనెప్పుడూ చూళ్లే’.. పంజాబ్‌ రాజకీయాలపై మనీశ్‌ తివారీ ఫైర్‌

తాజా వార్తలు

Published : 25/10/2021 01:31 IST

‘ఏందయ్యా ఈ అరాచకం.. నేనెప్పుడూ చూళ్లే’.. పంజాబ్‌ రాజకీయాలపై మనీశ్‌ తివారీ ఫైర్‌

చండీగఢ్‌: పాకిస్థాన్‌ జర్నలిస్టు వ్యవహరంలో పంజాబ్‌ కాంగ్రెస్‌ నేతలు, మాజీ సీఎం అమరీందర్‌ సింగ్‌ మధ్య నడుస్తున్న మాటల యుద్ధంపై కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత మనీశ్‌ తివారీ అసంతృప్తి వ్యక్తంచేశారు. ఇంతటి అరాచకం తానెప్పుడూ చూడలేదని అసహనం వ్యక్తంచేశారు. పార్టీ నేతలు వాడుతున్న భాషపైనా అభ్యంతరం వ్యక్తంచేస్తూ ఆదివారం ఆయన వరుస ట్వీట్లు చేశారు.

అమరీందర్‌ ప్రభుత్వ హయాంలో పలుమార్లు పంజాబ్‌ను సందర్శించిన పాకిస్థానీ జర్నలిస్టు అరూసా ఆలంకు ఆ దేశ గూఢచార సంస్థ ఐఎస్‌ఐతో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ జరుపుతామని పంజాబ్‌ డిప్యూటీ సీఎం సుఖ్‌జిందర్‌సింగ్‌ రంధావా ప్రకటించారు. ఆమెకు డబ్బులో, కానుకలో ఇవ్వకుండా రాష్ట్రంలో ఒక్క పోస్టింగు కూడా అప్పట్లో జరిగేది కాదు అంటూ ఆ మరుసటి రోజే పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్‌పై ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నవజోత్‌సింగ్‌ సిద్ధూ భార్య నవజోత్‌ కౌర్‌ ఆరోపించారు.

ఈ నేపథ్యంలో తివారీ వరుస ట్వీట్లు చేశారు. తన 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో కాంగ్రెస్‌లో ఇంతటి అరాచకం చూడలేదని ఏర్కొన్నారు. అలాంటిది పంజాబ్‌ కాంగ్రెస్‌లో ఇవాళ తాను చూస్తున్నానని పేర్కొన్నారు. ఏఐసీసీ సభ్యులను పీసీసీ సభ్యులు తప్పుబట్టడం, చిన్న పిల్లల మాదిరిగా బహిరంగంగా ఒకరినొకరు విమర్శించుకోవడాన్ని తప్పుబట్టారు. దిగజారిన మాటలను చూసి ప్రజలు అసహ్యించుకోరని అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. మల్లికార్జున ఖర్గే నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల బృందం పంజాబ్‌ రాజకీయాల్లోని  ముఠా తగాదాలను అరికట్టడంలో విఫలమయ్యిందన్నారు. 2015 నాటి ఘటనలు, డ్రగ్‌ మాఫియా, విద్యుత్‌ ఒప్పందాలు గురించి, ఇసుక మైనింగ్‌ గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని