
తాజా వార్తలు
పిలిచి అవమానించారు.. మాట్లాడను: మమత
కోల్కతా: విక్టోరియా మెమోరియల్ వేదికగా జరిగిన సుభాష్ చంద్రబోస్ జయంత్యుత్సవ కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒకింత అసహనానికి లోనయ్యారు. తనకు అవమానం జరిగిందంటూ మాట్లాడేందుకు నిరాకరించారు. నేతాజీ 125 జయంతిని పురస్కరించుకుని స్థానిక విక్టోరియా మెమోరియల్ వేదికగా శనివారం ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ, గవర్నర్ జగ్దీప్ ధన్కర్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడేందుకు మమతను ఆహ్వానించారు. అయితే, ఆమె వేదికపై చేరుకునే సమయంలో కొందరు పెద్దఎత్తున మోదీకి మద్దతుగా నినాదాలు చేశారు. అలాగే ‘జై శ్రీరామ్’ అంటూ నినదించారు. దీంతో మమత అసహనానికి గురయ్యారు. ‘‘ఇదేమీ రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిన కార్యక్రమం కాదు.. ప్రభుత్వ కార్యక్రమం. ఇలాంటి చోట హుందాగా వ్యవహరించాలి. నేతాజీకి సంబంధించి కోల్కతాలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రధాని మోదీకి, సాంస్కృతిక శాఖ మంత్రికి కృతజ్ఞతలు. నాకు అవమానం జరిగింది. ఇంతకంటే నేనేమీ మాట్లాడను. జై హింద్.. జై బంగ్లా’’ అంటూ తన ప్రసంగాన్ని ముగించి వెనుదిరిగారు.
ఇదీ చదవండి..
ఒకే వేదికపై మోదీ.. దీదీ