అగ్రిగోల్డ్‌ బాధితులకు పరిహారం ఇవ్వండి: రఘురామ
close

తాజా వార్తలు

Updated : 14/06/2021 08:28 IST

అగ్రిగోల్డ్‌ బాధితులకు పరిహారం ఇవ్వండి: రఘురామ

సీఎం జగన్‌కు ఎంపీ ఐదో లేఖ

దిల్లీ: ఏపీలోని అగ్రిగోల్డ్‌ బాధితులకు పరిహారం విడుదల చేయాలని సీఎం జగన్‌ను నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కోరారు. ఈ మేరకు సీఎంకు వరుసగా ఐదో లేఖ రాశారు. ఎన్నికల్లో వైకాపా ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ గత నాలుగు రోజులుగా జగన్‌కు రఘురామ లేఖలు రాస్తున్నారు. తొలి నాలుగు రోజుల్లో వృద్ధాప్య పింఛన్ల పెంపు, సీపీఎస్ రద్దు‌, పెళ్లికానుక..షాదీముబారక్‌, ఉద్యోగాల భర్తీ క్యాలెండర్‌ అంశాలను ప్రస్తావించిన ఆయన.. తాజాగా అగ్రిగోల్డ్‌ బాధితులకు చెల్లించాల్సిన పరిహారంపై లేఖ రాశారు. బాధితుల్లో ఎక్కువగా రోజువారీ కూలీలు, చిరు వ్యాపారులే ఉన్నారని వారిని ఆదుకోవాలన్నారు.

వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే 80 శాతం మంది బాధితుల‌కు మేలు చేసేలా రూ.1100 కోట్లు విడుదల చేస్తామని ఎన్నికల ప్రచారంలో జగన్‌ హామీ ఇచ్చిన విషయాన్ని రఘురామ గుర్తు చేశారు. వెంటనే అగ్రిగోల్డ్‌ బాధితులకు పరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని