ప్రభుత్వ నిర్లక్ష్యమే అస్వస్థతకు కారణం: లోకేశ్‌

తాజా వార్తలు

Published : 07/12/2020 00:53 IST

ప్రభుత్వ నిర్లక్ష్యమే అస్వస్థతకు కారణం: లోకేశ్‌

అమరావతి: ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ప్రజలు అస్వస్థతకు గురయ్యారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పేర్కొన్నారు. ప్రజలు ఒక్కసారిగా మూర్ఛ తదితర లక్షణాలతో అనారోగ్యం బారిన పడ్డారని ఆయన వివరించారు. బాధితుల్లో ఎక్కువగా చిన్నారులే ఉన్నారని ఆయన అన్నారు. వైద్యశాఖ మంత్రి సొంత నియోజకవర్గంలోనే ప్రజల ప్రాణాలకు భరోసా లేకపోతే రాష్ట్రంలో మిగతా ప్రాంతాల పరిస్థితి తలచుకుంటే ఆందోళనగా ఉందని లోకేశ్‌ తెలిపారు. అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.  Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని