AP news: 146 జీవో విడుదలపై రఘురామ ఆగ్రహం

తాజా వార్తలు

Published : 26/06/2021 09:42 IST

AP news: 146 జీవో విడుదలపై రఘురామ ఆగ్రహం

అమరావతి: నవప్రభుత్వ కర్తవ్యాల పేరుతో సీఎం జగన్‌కు నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు మరో లేఖ రాశారు. తిరుమలలో స్పెసిఫైడ్‌ అథారిటీ ఏర్పాటు చేసేందుకు వీలుగా.. 146 జీవో విడుదల చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై రాష్ట్ర ప్రజానీకం తీవ్ర ఆందోళనకు గురవుతోందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకే ఇలాంటి చర్యలకు ఉపక్రమించారని ధ్వజమెత్తారు. హిందూ ధర్మాన్ని ఆచరించే వాళ్ల నమ్మకాలను ఇది తీవ్రంగా గాయపరుస్తోందని అభిప్రాయపడ్డారు. ఇద్దరే సభ్యులతో స్పెసిఫైడ్‌ అథారిటీ ఏర్పాటు చేస్తే.. వారు సమగ్రంగా చర్చించేందుకు  వీలుండదన్నారు. సాధారణంగా దేవాదాయ, ధర్మాదాయ శాఖ ముఖ్య కార్యదర్శిగానీ, కమిషనర్‌ గానీ అథారిటీలో సభ్యులుగా ఉంటారని, అటువంటి సంప్రదాయం పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని అభిప్రాయపడ్డారు. తీవ్రమైన ఆర్థిక లోటు నుంచి బయటపడేందుకు ప్రభుత్వ బాండ్లను జారీ చేసి,  ఆ బాండ్లను కనీసంగా రూ.5 వేల కోట్ల మేర తితిదే స్పెసిఫైడ్‌ అథారిటీ ద్వారా కొనుగోలు చేస్తారనే ప్రచారం జరుగుతోందని, దీనిపైనా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. తక్షణమే కొత్త బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని