సీఎం కేసీఆర్‌కు పొన్నాల సవాల్‌
close

తాజా వార్తలు

Published : 15/04/2021 11:49 IST

సీఎం కేసీఆర్‌కు పొన్నాల సవాల్‌

హైదరాబాద్‌: ఏడేళ్లుగా గుర్తుకు రాని సాగర్‌ నియోజకవర్గంపై.. ఉప ఎన్నిక వేళ సీఎం కేసీఆర్‌ వరాల జల్లు కురిపిస్తున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పొన్నాల లక్ష్మయ్య ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ అన్నింట్లోనూ అబద్దాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకుంటే కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యేవారా అని ప్రశ్నించారు. నీటి పారుదల ప్రాజెక్టులపై నిపుణులతో చర్చకు రావాలని సీఎంకు సవాల్‌ విసిరారు. కాగా, సాగర్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ తరఫున సీనియర్‌ నాయకుడు జానారెడ్డి, అధికార పార్టీ తెరాస తరఫున నోముల భగత్‌, భాజపా నుంచి రవికుమార్‌ బరిలో నిలిచిన విషయం తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని