రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు: రేవంత్‌ 

తాజా వార్తలు

Published : 10/07/2021 01:09 IST

రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు: రేవంత్‌ 

హైదరాబాద్‌: తెరాసలో చేరిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు స్పీకర్‌ ఫార్మెట్‌లో రాజీనామాలు ఇవ్వాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో రేవంత్‌ మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత తాను జీతం తీసుకోలేదని స్పష్టం చేశారు. కేసీఆర్‌, గంగుల, ఎర్రబెల్లి, తలసాని, మల్లారెడ్డి, కొప్పుల తెదేపా నుంచి వచ్చిన వారేనని గుర్తు చేశారు. తెరాసను విలీనం చేస్తానని చెప్పి కేసీఆర్‌.. సోనియాను మోసం చేశారని ఆరోపించారు. జలవివాదాలపై సీఎం కేసీఆర్‌, జగన్‌ సురభి నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు.

‘‘నా వల్లే కిషన్‌రెడ్డికి కేబినెట్‌ హోదా దక్కింది. కాంగ్రెస్‌కు బలమైన పీసీసీ ఉన్నాడు కాబట్టే కిషన్‌రెడ్డికి ప్రమోషన్‌ వచ్చింది. తెరాసకు నిర్మాణం లేదు.. ఎప్పుడైనా పేక మేడలా కూలిపోతుంది. భాజపాలో చేరి.. తెలంగాణ ఉద్యమకారుడని చెప్పుకొనే అర్హత ఈటల రాజేందర్‌ కోల్పోయారు. ఈటల రాజేందర్‌ ఒకప్పుడు కమ్యూనిస్టు, ఇప్పుడు క్యాపిటలిస్ట్‌. తెలంగాణ అమర వీరుల స్తూపం కాంట్రాక్టులో రూ.100 కోట్ల దోపిడీ జరిగింది. 2022 ఆగస్టు తర్వాత కేసీఆర్‌ ప్రభుత్వాన్ని రద్దు చేస్తారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయి. వైఎస్‌ఆర్‌ చివరి కోరిక రాహుల్‌ గాంధీని ప్రధానిని చేయడం. వైఎస్‌ఆర్‌ చివరి కోరికను ఆ కుటుంబం నెరవేర్చాలి’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని