కాంగ్రెస్‌ నిర్ణయంపై శివసేన అసంతృప్తి!

తాజా వార్తలు

Published : 07/02/2021 00:43 IST

కాంగ్రెస్‌ నిర్ణయంపై శివసేన అసంతృప్తి!

ముంబయి: మహారాష్ట్ర స్పీకర్‌ రాజీనామా విషయంలో భాగస్వామ్య పార్టీ అయిన కాంగ్రెస్‌ నిర్ణయంపై శివసేన అసంతృప్తి వ్యక్తం చేసింది. బాలా సాహెబ్‌ థరోట్‌ను తొలగించి మహారాష్ట్ర పీసీసీ చీఫ్‌గా నానా పటోలేను నియమించడం పట్ల ఒకింత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ తన అధికారిక పత్రిక ‘సామ్నా’లో సంపాదకీయం రాసింది. తరువాతి స్పీకర్‌ ఎవరనే దానిపై చర్చలు జరుగుతున్నాయని పేర్కొంది. 

ఒప్పందంలో భాగంగా మహా వికాస్‌ అఘాడీ ప్రభుత్వంలో ఐదేళ్ల కాలానికి కీలకమైన స్పీకర్‌ పదవి కాంగ్రెస్‌ లభించింది. అయితే, వచ్చే నెల 1న మహారాష్ట్ర బడ్జెట్‌ ఉండగా స్పీకర్‌గా ఉన్న పటోలేను తొలగించి ఆయనకు పీసీసీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించింది. దీనిపై శివసేన స్పందిస్తూ.. సంస్థాగత మార్పులు ఆ పార్టీ వ్యక్తిగత అంశంమంటూనే.. ఆ పార్టీ తీసుకునే నిర్ణయం ప్రభుత్వంపై ఉండకూడదని అభిప్రాయపడింది.

రెండేళ్ల క్రితం కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాని సమయంలో బాలా సాహెబ్‌ థరోట్‌ బాధ్యతలు స్వీకరించారని ఈ సందర్భంగా శివసేన గుర్తుచేసింది. ఆయన కృషి వల్లే అనుకున్నదానికంటే ఎక్కువ సీట్లను ఆ పార్టీ సాధించిందని అభిప్రాయపడింది. పటోలే దూకుడు కాంగ్రెస్‌కు పనికొచ్చేదే అయినా.. మరీ అంత దూకుడు చేటు చేస్తుందని పేర్కొంది. అలానే ప్రభుత్వ పాలన సజావుగా సాగేందుకు కృషి చేయాలని కాంగ్రెస్‌ పార్టీని శివసేన కోరింది. మూడు పార్టీలు కలిసి తదుపరి స్పీకర్‌పై నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది.

ఇదీ చదవండి..
మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ రాజీనామా 

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని