పవన్‌ కల్యాణ్‌ను కలిసిన సోము వీర్రాజు
close

తాజా వార్తలు

Updated : 07/08/2020 16:47 IST

పవన్‌ కల్యాణ్‌ను కలిసిన సోము వీర్రాజు

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు శుక్రవారం జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. భాజపా అధ్యక్షుడిగా నియమితులైనందుకు సోము వీర్రాజుకు పవన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా శాలువా కప్పి సోము వీర్రాజును సత్కరించారు. ఏపీలో రెండు పార్టీలు కలిసి పనిచేయడంపై ఇరువురు నేతలు సమాలోచనలు జరిపారు. తాజా రాజకీయ పరిణామాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. ఏపీలో భాజపా, జనసేన కలిసి పనిచేస్తున్న విషయం తెలిసిందే.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని