AP News: ఆనందయ్య మందు పేదలకు వద్దా?

తాజా వార్తలు

Published : 27/05/2021 12:43 IST

AP News: ఆనందయ్య మందు పేదలకు వద్దా?

ఏపీ ప్రభుత్వాన్ని నిలదీసిన సోమిరెడ్డి

నెల్లూరు: నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య ఆయుర్వేద మందు పెద్దలకేనా.. పేదలకు వద్దా? అని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రశ్నించారు. కృష్ణపట్నం పోర్టులోని సీవీఆర్‌ ఫౌండేషన్‌ బిల్డింగ్‌లో అనధికారికంగా వేలాది మందికి తయారు చేయించుకుంటారా అని మండిపడ్డారు.

ఆనందయ్య మందుతో ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేవని ఆయుష్‌ కమిషనర్‌, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ప్రకటించినా పంపిణీకి ఎందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం లేదని సోమిరెడ్డి నిలదీశారు. ఈ మందుపై ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడం దురదృష్టకరమన్నారు. ఆనందయ్యను నిర్బంధించడం న్యాయం కాదని.. వెంటనే ఆయనకు స్వేచ్ఛ కల్పించాలని డిమాండ్‌ చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని