‘గని పేలుడుపై వాస్తవాలు బయటకు రావట్లేదు’
close

తాజా వార్తలు

Published : 13/05/2021 01:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘గని పేలుడుపై వాస్తవాలు బయటకు రావట్లేదు’

సి.రామచంద్రయ్య జోలికి వెళ్లొద్దని ఆదేశాలిచ్చారా?
తెదేపా ఎమ్మెల్సీ బీటెక్‌ రవి ఆరోపణలు

కడప: మామిళ్లపల్లె గనుల పేలుడు ఘటనలో వాస్తవాలు బయటకు రావట్లేదని తెదేపా ఎమ్మెల్సీ బీటెక్‌ రవి ఆరోపించారు. ఈ వ్యవహారంలో అసలు దోషులను వదిలేయాలని చూస్తున్నారా అని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. అసలు లీజుదారుగా వైకాపా ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య సతీమణి కస్తూరిబాయి పేరు ఉందని బీటెక్‌ రవి చెప్పారు. 2001 నుంచి 2022 వరకు లీజు పరిమితి ఉన్నట్లు తెలిపారు. గని యజమానిగా పేర్కొన్న నాగేశ్వర్‌రెడ్డిపై చాలా కేసులున్నాయని.. గతంలోనూ ఆయన జైలుకెళ్లి వచ్చారన్నారు. నాగేశ్వర్‌రెడ్డికి సబ్‌ లీజుకు ఇచ్చారా? ఇచ్చినట్లు సృష్టించారా? అని ఆయన నిలదీశారు. 

అనుమతి లేకుండా రూ.100 కోట్ల విలువైన సామగ్రిని తరలించారని బీటెక్‌ రవి ఆరోపించారు. రామచంద్రయ్య కుటుంబసభ్యుల జోలికి వెళ్లొద్దని ఆదేశాలిచ్చారా? అని పోలీసులను ప్రశ్నించారు. పేలుళ్ల ఘటనకు రామచంద్రయ్య, ఆయన సతీమణే కారణమని.. వారిపై చర్యలు తీసుకోకపోతే తెదేపా తరఫున కోర్టులో ప్రైవేట్‌ కేసు వేస్తామన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని