ఆయనకు కేబినెట్‌ స్పెల్లింగ్‌ కూడా రాదు..

తాజా వార్తలు

Published : 31/10/2020 17:06 IST

ఆయనకు కేబినెట్‌ స్పెల్లింగ్‌ కూడా రాదు..

 

పట్నా: కేబినెట్ పదానికి స్పెల్లింగ్ కూడా చెప్పలేని ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్.. ఇంజనీరింగ్ పట్టభద్రుడైన ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను విమర్శిస్తున్నారంటూ కేంద్రమంత్రి అశ్వినీ చౌబే ఎద్దేవా చేశారు. నితీశ్ నాయకత్వంలో అభివృద్ధి జరగలేదని, నిరుద్యోగం తాండవిస్తోందని..తాము అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ తేజస్వి బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోకి దిగిన సంగతి తెలిసిందే. ఆయన 10 లక్షల ఉద్యోగాల హామీని మొదటి నుంచి అధికార కూటమి విమర్శిస్తూనే ఉంది.

‘సమస్యను అర్థం చేసుకోలేని ఒక వ్యక్తి..పదో తరగతి కూడా పాస్‌కాని ఒక వ్యక్తి..ఇంజనీరింగ్ పట్టభద్రుడైన నితీశ్‌ కుమార్‌ను విమర్శిస్తున్నారు. ఆయనకు కనీసం కేబినెట్ స్పెల్లింగ్ కూడా రాయడం రాదు. ఆయన తండ్రి లక్ష ఉద్యోగాలు కల్పిస్తానని మొదటి కేబినెట్‌ సమావేశంలో హామీ ఇచ్చారు. ఇప్పటికీ ఆ ఉద్యోగ దరఖాస్తులు అక్కడ చెత్త బుట్టలోనే ఉన్నాయి. ఉద్యోగాల పేరు చెప్పి డబ్బులు మాత్రం వసూలు చేశారు. ఆ కాంగ్రెస్‌, ఆర్జేడీ కూటమి పెద్ద పెద్ద తప్పుడు హామీలు మాత్రమే ఇస్తుంది. వాటి పట్ల ప్రజలు అప్రమత్తతతో ఉండాలి’ అని చౌబే మీడియాతో మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

కాగా, తేజస్వీ యాదవ్‌ను ఆటవిక రాజ్యం యువరాజ్‌తో పోలుస్తూ ఇటీవల ప్రధాని మోదీ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. కిడ్నాపులపై వారికి కాపీరైట్ ఉందని ఆరోపిస్తూ, జాగ్రత్తగా ఉండమని ప్రజలకు సూచించారు. చీకటి నుంచి బిహార్‌ను బయటపడేసిన ప్రభుత్వాన్ని తిరిగి ఎన్నుకోవడానికి మరోసారి అవకాశం వచ్చిందన్నారు.  


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని