Bhatti Vikramarka: ‘వరి వేస్తే ఉరే’ అని సీఎం స్వయంగా అంటే ఎలా?: భట్టి

తాజా వార్తలు

Published : 15/09/2021 01:55 IST

Bhatti Vikramarka: ‘వరి వేస్తే ఉరే’ అని సీఎం స్వయంగా అంటే ఎలా?: భట్టి

హైదరాబాద్: ‘‘నదీజలాలను వాడుకొని ఆహార ధాన్యాలను పెంచుకోవాలని అనుకున్నాం. రెండు జీవనదులపై నిర్మిస్తున్న ప్రాజెక్టుల ద్వారా లక్షల ఎకరాల్లో సాగు జరుగుతుందని సీఎం అన్నారు. ఇప్పుడేమో.. వరి వేస్తే ఉరే అని స్వయంగా సీఎం అంటే ఎలా..’’ అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద భట్టి మాట్లాడారు. సీఎంవో ప్రకటనలతో ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారు. దిల్లీలో ఉన్న ఓ పెద్దాయన అన్నారని చెప్పడం కాకుండా ధాన్యం కొనుగోళ్లపై క్లారిటీ ఇవ్వాలన్నారు.

‘‘దళిత బంధు పైలట్‌ ప్రాజెక్టు అమలుపై నిన్న జరిగిన సన్నహక సమావేశంలో చాలా అంశాలను ప్రస్తావించాను. ఆ విషయాలను వారికి కావాల్సిన రీతిలో మలుచుకున్నారు. కొత్త పథకం.. దానిపై సందేశాలు, అపోహలు ఉన్నాయని.. దానిపై స్పష్టత ఇవ్వాలని కోరాం. రాష్ట్రంలోని అన్ని దళిత కుటుంబాలకు ఇవ్వాలని సూచించాం. కొత్తగా పెళ్లిళ్లు చేసుకున్న దంపతులు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే వారిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని చెప్పాం. కేవలం నాలుగు మండలాలకు పరిమితం కాకుండా.. ఏఏ సంవత్సరం ఎన్ని వేల కోట్లు కేటాయించనున్నారో చెప్పాలని కోరాం. దళిత బంధు నామమాత్రపు పథకంగా మిగిగిపోకుండా అన్ని చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాం. దళిత బంధు పూర్తిగా అమలు చేయాలంటే రూ. 1.70 లక్షల కోట్లు కావాలి. ఇది ఎలా భర్తీ చేస్తారో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి’’ అని భట్టి అన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని