దక్షిణ తెలంగాణను కేసీఆర్‌ విస్మరించారు: అరుణ

తాజా వార్తలు

Updated : 17/07/2021 13:48 IST

దక్షిణ తెలంగాణను కేసీఆర్‌ విస్మరించారు: అరుణ

హైదరాబాద్‌: కృష్ణా, గోదావరి నదీ జలాలకు సంబంధించి బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ కేంద్రం ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్‌ను స్వాగతిస్తున్నట్లు భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ తెలిపారు. ఇన్నాళ్లుగా కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. జగన్‌తో కుమ్మక్కైన కేసీఆర్‌ దక్షిణ తెలంగాణను విస్మరించారని ఆమె ఓ ప్రకటనలో ఆరోపించారు. పక్క రాష్ట్రం అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు విస్తరణ పనులను కేఆర్‌ఎంబీ నిలిపేస్తుందని అరుణ పేర్కొన్నారు.

కేంద్ర విడుదల చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌పై తెరాస నాయకులు ఏవేవో మాట్లాడుతున్నారని విమర్శించారు. విభజన చట్టం ప్రకారమే బోర్డుల పరిధిని కేంద్రం నోటిఫై చేసిన విషయాన్ని మర్చిపోవద్దని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న బోర్డుల పరిధి నిర్ణయం రాష్ట్రానికి మేలు చేసేలా ఉందని అరుణ వివరించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని