Ap News: రాహుల్‌తో జట్టుకట్టిన చంద్రబాబు.. అమిత్ షాను ఎలా కలుస్తారు: కొడాలి

తాజా వార్తలు

Published : 20/10/2021 19:40 IST

Ap News: రాహుల్‌తో జట్టుకట్టిన చంద్రబాబు.. అమిత్ షాను ఎలా కలుస్తారు: కొడాలి

అమరావతి: తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై ఆ పార్టీ అధినేత చంద్రబాబే దాడులు చేయించారని మంత్రి కొడాలి నాని ఆరోపించారు. పెయిడ్ ఆర్టిస్టులకు జీతమిస్తూ, చెప్పినట్లు మాట్లాడే వారితో చంద్రబాబు రెచ్చగొట్టించారని విమర్శించారు. రాష్ట్రంలో పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు వైకాపా అభ్యర్థులే గెలుస్తున్నారని.. దీన్ని సహించలేకే చంద్రబాబు ఇలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎంతమంది చంద్రబాబులు వచ్చినా ప్రజల్లో జగన్‌పై ఉన్న అభిమానాన్ని తగ్గించలేరన్నారు. ఇలా కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను ఉసిగొల్పి తిట్టించడం ఆయనకు పరిపాటిగా మారిందని అసహనం వ్యక్తం చేశారు.

సీఎం జగన్‌ సహా వైకాపా మంత్రులు, నేతలను ఎవరు తిట్టినా దానికి మూల కారణం చంద్రబాబే అని నాని అన్నారు. ప్రధాని మోదీని దింపాలని రాహుల్‌తో జట్టుకట్టిన చంద్రబాబు.. అమిత్ షాను ఎలా కలుస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్ ఇద్దరూ స్నేహితులని.. వారిద్దరూ కలిసి నాటకాన్ని రక్తి కట్టిస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ పెయిడ్ ఆర్టిస్టులు హద్దులు మీరకూడదని.. ఆలోచించి మాట్లాడాలని కొడాలి నాని హెచ్చరించారు. చంద్రబాబు పిలుపునిచ్చిన బంద్ విఫలమైందని.. రాష్ట్రంలో ఎక్కడా ఒక్క బడ్డీ కొట్టు కూడా మూయలేదన్నారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని