Raghurama: నాపై విజయసాయి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు: రఘురామ

తాజా వార్తలు

Published : 26/07/2021 14:00 IST

Raghurama: నాపై విజయసాయి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు: రఘురామ

దిల్లీ: తనపై ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్‌లో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. తాను విదేశాలకు వెళ్లకుండా చూడాలంటున్నారని.. 20 కేసులున్న విజయసాయిరెడ్డి విదేశాలకు వెళ్లొచ్చా? అని ప్రశ్నించారు. దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో రఘురామ మాట్లాడారు. ఏ-1 చేపట్టిన పనులపై రాష్ట్రపతి, ప్రధానికి లేఖ రాసినట్లు ఆయన చెప్పారు. ఏ-2 స్థాపించిన సూట్‌ కేసు కంపెనీలతో ఏ-1 కార్యకలాపాలు జరిగాయన్నారు. క్విడ్‌ప్రోకో, సూట్‌ కేసు కంపెనీల బాగోతాన్ని లేఖలో వివరించినట్లు రఘురామ చెప్పారు. జగన్‌, విజయసాయిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరినట్లు ఆయన తెలిపారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని