స్నేహితుల మధ్య సఖ్యత ఏమైంది: చంద్రబాబు

తాజా వార్తలు

Updated : 15/07/2021 20:11 IST

స్నేహితుల మధ్య సఖ్యత ఏమైంది: చంద్రబాబు

అమరావతి: తెలుగు రాష్ట్రాలను భిన్న ధృవాలు పాలించినప్పుడు తలెత్తని నీటి వివాదం, కుదిరిన సఖ్యత.. ఇప్పుడు స్నేహితుల మధ్య ఎందుకు బెడిసికొట్టిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పొలిట్‌ బ్యూరో సమావేశంలో అభిప్రాయపడ్డారు. తాను సీఎంగా ఉన్నప్పుడు కృష్ణా జలాల్లో 512 టీఎంసీలు ఏపీ, 299 టీఎంసీలు తెలంగాణ తీసుకునేలా ఎలాంటి వివాదం లేకుండా ఒప్పందం అమలైందనే విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. జలవివాదాన్ని కలిసి పరిష్కరించుకోలేని పరిస్థితులే ఉంటే అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని ఎందుకు కోరడం లేదని నిలదీశారు. 

పోలవరం నిర్వాసితుల పట్ల వైకాపా నిర్లక్ష్యం కారణంగా గిరిజనులు మళ్లీ అడవుల పాలయ్యే దుస్థితి నెలకొందని మండిపడ్డారు. బహుళ ప్రయోజనాల కోసం శరవేగంగా ముగింపు దశకు తీసుకొచ్చిన పోలవరం ప్రాజెక్టును బ్యారేజిగా మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు అకాడమీ ఉనికి లేకుండా చేసే ప్రయత్నాన్ని ఖండిస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు, రహదారుల దుస్థితిపై త్వరలో తెలుగుదేశం ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టాలని పొలిట్‌ బ్యూరోలో నిర్ణయించారు. గత రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అప్పులు, ఇతర ఆర్థిక పరిస్థితులపై శ్వేతపత్రం విడుదల చేయాలని పొలిట్‌ బ్యూరో డిమాండ్‌ చేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని