అల్లుడి ఇంట్లో సోదాలు.. స్పందించిన స్టాలిన్‌

తాజా వార్తలు

Published : 02/04/2021 15:59 IST

అల్లుడి ఇంట్లో సోదాలు.. స్పందించిన స్టాలిన్‌

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పరిస్థితులు రసవత్తరంగా మారుతున్నాయి. డీఎంకే అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్‌ అల్లుడి ఇంట్లో ఐటీ సోదాలు తమిళ రాజకీయాల్లో కాకరేపాయి. శుక్రవారం ఉదయం స్టాలిన్ అల్లుడు శబరీశన్‌ ఇంట్లో ఆదాయ పన్నుశాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. అల్లుడి ఇంట్లో ఐటీ సోదాలపై స్టాలిన్‌ స్పందించారు. ఇలాంటి ఆటంకాలకు భయపడబోమని పేర్కొన్నారు. ‘మోదీకి ఒక్క విషయం తెలియజేయాలనుకుంటున్నా.. మేము ద్రవిడులం.. ఇలాంటి ఆటంకాలకు భయపడబోం’ అని ఘాటుగా స్పందించారు.

మరో నాలుగు రోజుల్లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న వేళ ఐటీ సోదాలు కలకలం రేపాయి. శబరీశన్‌ ఇంటితో సహా డీఎంకే పార్టీకి చెందిన నాలుగు ప్రాంతాల్లో అధికారులు దాడులు చేశారు. అన్నానగర్‌ డీఎంకే అభ్యర్థి మోహన్‌ కుమారుడి ఇంట్లోనూ సోదాలు జరిపారు. కాగా, ఈ దాడులపై డీఎంకే ఎంపీ ఆర్‌ఎస్‌ భారతి తమిళనాడు ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు. భాజపా ప్రభుత్వం ఐటీ శాఖను పావులాగా వాడుకుంటోందని ఆ లేఖలో పేర్కొన్నారు. దురుద్దేశంతోనే ఎన్నికలకు కొద్దిరోజుల ముందు ఈ దాడులు చేయించారని తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని