close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఒకే వ్యాక్సిన్‌కు మూడు ధరలా: సోనియా

  నూతన టీకా విధానాన్ని ఉపసంహరించాలని డిమాండ్‌

ఈనాడు, దిల్లీ: సీరం సంస్థ తాను సరఫరా చేసే కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ ధరలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు ఆసుపత్రులకు వేర్వేరుగా నిర్ధారించడాన్ని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ తప్పుపట్టారు. ఒకే సంస్థ తయారుచేసిన ఒక వ్యాక్సిన్‌ ధర మూడు రకాలుగా ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని ఎలా అనుమతించారో అర్థంకాని పరిస్థితి నెలకొందని పేర్కొంటూ ఆమె గురువారం ప్రధానమంత్రి నరేంద్రమోదీకి రెండు పేజీల లేఖ రాశారు. ‘‘నూతన వ్యాక్సిన్‌ విధానం ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. దేశంలోని 18-45 ఏళ్ల వయసు వారికి ఉచిత టీకా అందించడం నుంచి ప్రభుత్వం తప్పుకోవడం అంటే యువత యోగక్షేమ బాధ్యతలను పూర్తిగా విస్మరించడమే. సీరం ఇన్‌స్టిట్యూట్‌ కేంద్ర ప్రభుత్వానికి రూ.150, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.400, ప్రైవేటు వైద్యశాలలకు రూ.600కి వ్యాక్సిన్‌ అందిస్తామని ప్రకటించింది. ఈ నిర్ణయంలో హేతుబద్ధత, న్యాయం కనిపించడంలేదు. ప్రస్తుత సంక్షోభ సమయంలో ప్రజల కష్టాలను లాభాలుగా మార్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఎలా అనుమతిచ్చిందో అర్థం కావడంలేదు. ఆందోళనకర పరిస్థితుల్లో ప్రభుత్వం ఎందుకు ఇలాంటి బాధ్యతారాహిత్యమైన చర్యకు ఒడిగట్టింది? కేంద్ర ప్రభుత్వం వద్దకు వచ్చే 50% వ్యాక్సిన్‌ను అయినా సమాఖ్య స్ఫూర్తితో అన్ని రాష్ట్రాలకు పారదర్శకంగా, సమాన స్థాయిలో పంపిణీ చేయాలి. తక్షణం జోక్యం చేసుకొని దురుద్దేశపూరిత నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. 18 ఏళ్లపైబడిన వారందరికీ ఉచిత వ్యాక్సిన్‌ అందించాలి’’ అని సోనియా కోరారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు