రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో మళ్లీ అసమ్మతి!

ప్రధానాంశాలు

రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో మళ్లీ అసమ్మతి!

సచిన్‌ పైలట్‌కు పెరుగుతున్న మద్దతు

జైపుర్‌: రాజస్థాన్‌ కాంగ్రెస్‌ పార్టీలో మళ్లీ అసమ్మతి రాజుకుంటోంది. సీఎం అశోక్‌ గహ్లోత్‌తో విభేదిస్తున్న యువ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌కు పలువురు నాయకులు బహిరంగంగానే మద్దతు ఇస్తున్నారు. శుక్రవారం స్వగ్రామైన దౌసా జిల్లా భండానాలో తన తండ్రి రాజేశ్‌ పైలట్‌ వర్ధంతి కార్యక్రమంలో సచిన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హాజరైన పలువురు నేతలు ఆయనకు అండగా ఉంటున్నట్టు చెప్పారు. తోడభీం ఎమ్మెల్యే పి.ఆర్‌.మీనా మాట్లాడుతూ సచిన్‌ లేవనెత్తిన సమస్యలను పార్టీ అధిష్ఠానం పరిష్కరించాల్సి ఉందన్నారు. మరో సీనియర్‌ ఎమ్మెల్యే హేం రాం చౌధరి కూడా ఉదయం జైపుర్‌లో సచిన్‌ను కలిశారు. ఆయనకు మద్దతుగా ఎమ్మెల్యే పదవిని వదులుకుంటున్నట్టు గతంలోనే ప్రకటించారు. మాజీ మంత్రి విశ్వేంద్ర సింగ్‌, సీనియర్‌ నాయకులు వేద్‌ ప్రకాశ్‌ సోలంకి, ముకేశ్‌ భట్కర్‌, రాంనివాస్‌ గ్వారియా, రాకేశ్‌ పరీక్‌ కూడా ఆయనను కలిశారు. వారంతా మంత్రివర్గ విస్తరణలో జరుగుతున్న జాప్యంపైనే ప్రశ్నించారు. సచిన్‌ భాజపాలో చేరుతారన్న ఊహాగానాలు వ్యాపించాయి. వీటిని ఆయన ఖండించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని