రేపు కాంగ్రెస్‌ సేవా కార్యక్రమాలు: ఉత్తమ్‌
close

ప్రధానాంశాలు

రేపు కాంగ్రెస్‌ సేవా కార్యక్రమాలు: ఉత్తమ్‌

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్‌గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 19న రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కరోనా నేపథ్యంలో ప్రజలకు మెడికల్‌ కిట్లు, మాస్కులు, శానిటైజర్లు, నిత్యావసర సరకులు పంపిణీ చేయాలని సూచించారు. మహమ్మారితో మరణించిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి మనోధైర్యం కల్పించడంతోపాటు తోచిన విధంగా సహకారం అందించాలన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని