ఎన్నికలప్పుడే దళితులు గుర్తొస్తారా: జీవన్‌రెడ్డి

ప్రధానాంశాలు

ఎన్నికలప్పుడే దళితులు గుర్తొస్తారా: జీవన్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: ఎన్నికలప్పుడే సీఎం కేసీఆర్‌కు దళితుల ఆత్మగౌరవం గుర్తుకు వస్తుందని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి విమర్శించారు. జనాభా ప్రాతిపదికగా 15 శాతం ఉన్న దళితులకు మూడు మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉండగా ఒకటే ఇచ్చారని తెలిపారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడుతూ దళితులకు మూడెకరాల హామీని నెరవేర్చలేదని ఆక్షేపించారు. ఎన్నికల ముందు దళితుల్ని సీఎం చేస్తానన్న కేసీఆర్‌ తానే సీఎం పీఠం ఎక్కారని, రెండో దఫా దళితులకు ఉపముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టలేదన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని