బీసీల డిమాండ్లను కేంద్రం పట్టించుకోలేదు

ప్రధానాంశాలు

బీసీల డిమాండ్లను కేంద్రం పట్టించుకోలేదు

మంత్రి హరీశ్‌రావు విమర్శ

హుజూరాబాద్‌, న్యూస్‌టుడే: బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్‌ అమలు, బీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు, బీసీ జనగణన తదితర డిమాండ్లను కేంద్రం పట్టించుకోలేదని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఇలాంటి వాళ్లు బీసీలకు న్యాయం చేస్తామంటే ప్రజలు నమ్మరని వ్యాఖ్యానించారు. సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత భాజపా నేతలకు లేదని పేర్కొన్నారు. గురువారం హుజూరాబాద్‌లో విశ్వబ్రాహ్మణ సంఘం కమ్యూనిటీ భవనానికి ఆయన భూమిపూజ చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడారు. ప్రముఖ అంతర్జాతీయ సంస్థ మలబార్‌ గ్రూప్‌ తెలంగాణలో రూ.750 కోట్లతో వజ్ర, స్వర్ణాభరణాల తయారీ, శుద్ధి పరిశ్రమ ఏర్పాటు చేస్తోందని, నైపుణ్యం కలిగిన స్వర్ణకారులకు శిక్షణ ఇప్పించి అందులో ఉపాధి కల్పిస్తామని హరీశ్‌రావు తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని