తృణమూల్‌లో చేరిన బాబుల్‌ సుప్రియో

ప్రధానాంశాలు

తృణమూల్‌లో చేరిన బాబుల్‌ సుప్రియో

కోల్‌కతా: కేంద్రమంత్రి పదవి కోల్పోయినప్పటి నుంచి ఆగ్రహంతో ఉన్న ప్రముఖ గాయకుడు, భాజపా ఎంపీ బాబుల్‌ సుప్రియో శనివారం తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరారు. అసన్‌సోల్‌ నుంచి రెండు దఫాలుగా గెలిచిన ఆయన రెండు సార్లూ కేంద్ర మంత్రి పదవి పొందారు. జులైలో జరిగిన మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో పదవి కోల్పోయారు. పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో టాలీగంజ్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోవడమే ఇందుకు కారణం. మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురవడంతో ఇక రాజకీయాల నుంచి తప్పుకొంటానని, ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తానని ప్రకటించారు. భాజపా నాయకులు నచ్చజెప్పడంతో ఎంపీగా కొనసాగడానికి అంగీకరించారు. అయితే ఆకస్మికంగా మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ, రాజ్యసభ సభ్యుడు డెరెక్‌ ఓబ్రెయిన్‌ సమక్షంలో తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరారు. ‘‘రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో తృణమూల్‌లో చేరాను. సోమవారం దీదీని కలుస్తాను’’ అని సుప్రియో తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని