Revanth Reddy: హుజూరాబాద్‌ ఫలితం తర్వాత తెరాసలో తిరుగుబాటు

ప్రధానాంశాలు

Revanth Reddy: హుజూరాబాద్‌ ఫలితం తర్వాత తెరాసలో తిరుగుబాటు

డిసెంబరు 9న హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ బహిరంగ సభ

విలేకరులతో ఇష్టాగోష్ఠిలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: హుజూరాబాద్‌ ఉప ఎన్నిక తర్వాత తెరాసలో తిరుగుబాటు తప్పదని పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం సీఎల్పీ కార్యాలయంలో విలేకరులతో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. పార్టీలో తిరుగుబాటును ఎదుర్కోవడానికే ప్లీనరీ, విజయగర్జన సభ నిర్వహించనున్నట్లు కేసీఆర్‌ ప్రకటించారన్నారు.  తెరాస విజయగర్జనకు మించి డిసెంబరు 9న హైదరాబాద్‌లో సభ ఏర్పాటు చేస్తామని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్లు ఉండగా ముందస్తు ఎన్నికల గురించి కేసీఆర్‌ ప్రస్తావించడం దేనికి సంకేతమని ఆయన ప్రశ్నించారు. ‘ఎన్నికల షెడ్యూల్‌ ప్రకారం పార్లమెంటు కన్నా ఆరు నెలల ముందే అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి. 2022 ఆగస్టు 15తో దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతుంది. దీంతో కొత్త శకానికి నాంది అంటూ మోదీ డైరెక్షన్‌లో గుజరాత్‌తో కలిసి కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్తారు’ అని రేవంత్‌ జోస్యం చెప్పారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఫలితం తర్వాత ఏదో ఒక కారణంతో హరీశ్‌రావును కూడా బయటికి పంపుతారని ఆయన చెప్పారు. ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికల్లో భాజపాకు ఆర్థిక సర్దుబాటుతో పాటు ఎంఐఎం పోటీపై చర్చలు జరపడంలో మధ్యవర్తిత్వం నెరపడానికి; తనపై కేసులు, దాడులు లేకుండా ఉండడానికి మోదీతో కేసీఆర్‌ ఒప్పందం కుదుర్చుకున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఎస్సీలకు మూడెకరాలు, సీఎం పదవి ఇస్తానని చెప్పి మోసం చేసిన కేసీఆర్‌ నాయకత్వంలో మోత్కుపల్లి నర్సింహులు తెరాసలో చేరడాన్ని ఆయన విమర్శించారు.


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని