ఆధిపత్యం ఇలాగే ఉంటే.. విజయం మనదే 
close

తాజా వార్తలు

Updated : 28/12/2020 12:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆధిపత్యం ఇలాగే ఉంటే.. విజయం మనదే 

మూడోరోజూ పైచేయి సాధించిన భారత్‌ 

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్‌ డే టెస్టులో టీమ్‌ఇండియా విజయానికి చేరువలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగులకు ఆలౌటైన భారత్‌.. రెండో ఇన్నింగ్స్‌లోనూ కంగారూలను మరోసారి కట్టడి చేసింది. సోమవారం మూడో రోజు ఆట నిలిచే సమయానికి ఆస్ట్రేలియా 133/6తో నిలిచింది. దీంతో భారత్‌ కన్నా 2 పరుగుల ఆధిక్యం సంపాదించింది. ప్రస్తుతం కామరూన్‌ గ్రీన్‌(17), పాట్‌ కమిన్స్‌(15) క్రీజులో ఉన్నారు. ఇక మంగళవారం ఆస్ట్రేలియా టెయిలెండర్లను భారత బౌలర్లు ఎంత త్వరగా ఔట్ చేస్తారనే విషయంపైనే విజయం ఆధారపడింది. 

మరో 49 పరుగులకే..

277/5 ఓవర్‌నైట్‌ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన టీమ్‌ఇండియా మరో 49 పరుగులు చేసి చివరి ఐదు వికెట్లు కోల్పోయింది. అజింక్య రహానె(112; 223 బంతుల్లో 12x4) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌కు తోడు రవీంద్ర జడేజా(57; 159 బంతుల్లో 3x4) అర్ధశతకం బాదాడు. టెయిలెండర్లు పెద్దగా రాణించకపోవడంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగులు చేసింది. దాంతో ఆస్ట్రేలియాపై 131 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సంపాదించింది. కంగారూ బౌలర్లలో స్టార్క్‌, లైయన్‌ 3 వికెట్లు తీయగా, కమిన్స్‌ 2, హేజిల్‌వుడ్‌ 1 పడగొట్టారు.

మరోసారి తడబడిన ఆస్ట్రేలియా..
ఇక రెండో ఇన్నింగ్స్‌లో భారీ లోటును పూరించి ఈ మ్యాచ్‌లో నిలవాలని చూసిన ఆసీస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ జో బర్న్స్‌(4)ను ఉమేశ్‌ యాదవ్‌ నాలుగో ఓవర్‌లోనే ఔట్‌ చేసి భారత్‌కు శుభారంభం అందించాడు. ఆపై లబుషేన్‌(28), మాథ్యూవేడ్‌(48) కాసేపు వికెట్‌ కాపాడుకునే ప్రయత్నం చేశారు. అయితే, అశ్విన్‌ వేసిన ఓ చక్కటి బంతికి ప్రమాదకర లబుషేన్‌ పెవిలియన్‌ చేరాడు. స్లిప్‌లో రహానె చేతికి చిక్కాడు. 

అనూహ్య బంతికి స్మిత్‌ ఔట్‌..

తర్వాత వచ్చిన స్మిత్‌(8) మరోసారి నిరాశపరుస్తూ బుమ్రా బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. లెగ్‌సైడ్‌ వెళ్తున్న బంతి.. వికెట్ల అంచున తాకడంతో బెయిల్స్‌ ఎగిరిపడ్డాయి. అయితే, ఈ విషయాన్ని తొలుత బుమ్రా, స్మిత్‌ గమనించలేదు. తర్వాత తేరుకొని చూస్తే బెయిల్స్‌ పడిపోయాయి. దాంతో స్మిత్‌ వెనుతిరిగాడు. ఈ క్రమంలోనే వేడ్‌, టిమ్‌పైన్‌(1), ట్రావిస్‌ హెడ్‌(17) ఒక్క పరుగు తేడాలో ఔటయ్యారు. జడేజా.. వేడ్‌, పైన్‌ను పెవిలియన్‌ చేర్చగా.. మహ్మద్‌ సిరాజ్‌ హెడ్‌(19)ను బోల్తా కొట్టించాడు. దీంతో ఆసీస్‌ 99 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్‌ ఓటమి దిశగా సాగింది. అయితే, చివర్లో కామరూన్‌, పాట్‌ కమిన్స్‌ మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడి మూడో రోజును పూర్తి చేశారు. వీరిద్దరూ 34 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టు స్కోరును 133/6కి చేరవేశారు.

ఇవీ చదవండి.. 
రాహులో రాహులా.. 2020 సూపర్‌ హిట్
జడ్డూకు టెస్టుల్లో వీరాభిమానిని: మంజ్రేకర్‌

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని