close

తాజా వార్తలు

స్వదేశంలో టీమిండియాపై సిక్సర్ల వర్షం

ఈ సిరీస్‌లోనే విండీస్‌ రెండుసార్లు

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం: మూడు ఫార్మాట్ల క్రికెట్‌లో టీ20 మ్యాచ్‌లకు ఉండే క్రేజ్‌ అంతా ఇంతా కాదు. ఏ ఆటగాడైనా తన బ్యాట్‌ ఝుళిపిస్తే చాలు బౌండరీల మోత మోగాల్సిందే. ఇక అంతర్జాతీయ పొట్టి క్రికెట్‌లో స్వదేశంలో టీమిండియాపై అత్యధిక సిక్సులు బాదిన జట్టు ఏదైనా ఉందంటే అది విండీసే. గత మూడేళ్లలో కరీబియన్‌ జట్టు మూడు మ్యాచ్‌ల్లో పదికిపైగా సిక్సులు బాది రికార్డు సృష్టించింది. న్యూజిలాండ్‌, శ్రీలంక తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఆయా మ్యాచ్‌ల విశేషాలు ఒకసారి నెమరువేసుకుందాం. 

పొలార్డ్‌, హెట్మేయర్‌ రాణించినా కోహ్లీ మెరుపులతో..

హైదరాబాద్‌ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో డిసెంబర్‌ 6న జరిగిన తొలి టీ20లో విండీస్‌ బ్యాట్స్‌మెన్‌ పరుగుల వరద పారించారు. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన పొలార్డ్‌ సేన నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీస్కోర్‌ చేసింది. ఎవిన్‌ లూయిస్‌(40; 17 బంతుల్లో 3x4, 4x6), షిమ్రన్‌ హెట్మేయర్‌(56; 41 బంతుల్లో 2x4, 4x6), పొలార్డ్‌(37; 19 బంతుల్లో 1x4, 4x6) దంచి కొట్టారు. వీరితో పాటు బ్రాండన్‌ కింగ్‌(31; 23 బంతుల్లో 3x4, 1x6), జేసన్‌ హోల్డర్‌(24; 9 బంతుల్లో 1x4, 2x6) తమ వంతు రాణించారు. ఈ ఇన్నింగ్స్‌ మొత్తంలో ఆ జట్టు బ్యాట్స్‌మెన్‌ 15 సిక్సులు బాదారు. లక్ష్య ఛేదనలో కోహ్లీ(94; 50 బంతుల్లో 6x4, 6x6) చెలరేగడంతో టీమిండియా సునాయాస విజయం సాధించింది.

తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సిమ్మన్స్‌ విజృంభణ:

భారత్‌ x వెస్టిండీస్‌ జట్ల మధ్య ఆదివారం తిరువనంతపురంలో జరిగిన రెండో టీ20లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కోహ్లీసేన నిర్ణీత ఓవర్లలో 170/7 స్కోర్‌ చేసింది. శివమ్‌ దూబె(54; 30 బంతుల్లో 3x4, 4x6), రిషభ్‌పంత్‌(33; 22 బంతుల్లో 3x4, 1x6) ధాటిగా ఆడారు. అనంతరం విండీస్‌ 18.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. సిమ్మన్స్‌(67; 45 బంతుల్లో 4x4, 4x6), ఎవిన్‌ లూయిస్‌(40; 35 బంతుల్లో 3x4, 3x6), హెట్మేయర్‌(23; 14 బంతుల్లో 3x6), నికోలస్‌ పూరన్‌(38; 18 బంతుల్లో 4x4, 2x6) భారీ సిక్సులతో విరుచుకుపడ్డారు. దీంతో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కరీబియన్‌ జట్టు విజయం సాధించడమే కాక సిరీస్‌ను సమం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ మొత్తం 12 సిక్సులు కొట్టారు.

2016 టీ ప్రపంచకప్‌ సెమీస్‌లోనూ అతడే:

ముంబయి వాంఖడే వేదికగా 2016లో విండీస్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్‌ రెండో సెమీ ఫైనల్లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ధోనీసేన రెండు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. రోహిత్‌శర్మ(43; 31 బంతుల్లో 3x4, 3x6), విరాట్‌ కోహ్లీ(89; 47 బంతుల్లో 11x4, 1x6) రాణించారు. ఛేదనలో విండీస్‌ బ్యాట్స్‌మెన్‌ సిమ్మన్స్‌(82; 51 బంతుల్లో 7x4, 5x6), రసెల్‌(43; 20 బంతుల్లో 3x4, 4x6), చార్ల్స్‌(52; 36 బంతుల్లో 7X4, 2x6) సిక్సుల వర్షం కురిపించారు. దీంతో విండీస్‌ ఏడు వికెట్ల తెడాతో భారీ విజయం సాధించి టీమిండియాను ఓడించింది. ఈ మ్యాచ్‌లో ఆ జట్టు మొత్తం 11 సిక్సులు బాదింది. 

కొలిన్‌ మన్రో శతకం.. న్యూజిలాండ్‌ విజయం:

రాజ్‌కోట్‌ వేదికగా 2017లో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20లో ఆ జట్టు ఓపెనర్‌ కొలిన్‌ మన్రో(109; 58 బంతుల్లో 7X4, 7x6) చెలరేగిపోయాడు. అతడి శతకానికి మార్టిన్‌ గప్తిల్‌ (45; 41 బంతుల్లో 3x4, 3x6) తోడవడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆ జట్టు రెండు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. అనంతరం టీమిండియా 156/7కే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో మన్రో, గప్తిల్‌ 10 సిక్సులు బాదారు.

రోహిత్‌ శతక్కొట్టిన వేళ శ్రీలంక విలవిల:

2017లో ఇండోర్‌ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా తొలుత బ్యాటింగ్‌ చేసి ఐదు వికెట్ల నష్టానికి 260 పరుగుల రికార్డు స్కోర్‌ సాధించింది. రోహిత్‌శర్మ(118; 43 బంతుల్లో 12x4, 10x6), కేఎల్‌ రాహుల్‌( 89; 49 బంతుల్లో 5x4, 8x6) బ్యాట్లు ఝుళిపించడంతో భారత్‌ సంపూర్ణ ఆధిపత్యం చెలాయించింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన లంక జట్టు 17.2 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది. పెరీరా(77; 37 బంతుల్లో 4x4, 7x6), తరంగా(47; 29 బంతుల్లో 3x4, 2x6), డిక్‌విల్లా(25; 19 బంతుల్లో 2x4, 1x6) రాణించినా మిగతా బ్యాట్స్‌మన్‌ విఫలమయ్యారు. అయినా ఈ ముగ్గురు పది సిక్సులు బాదడం గమనార్హం.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.