close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 27/05/2020 00:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆటలో రెండో రోజు కరోనా వస్తే ఏం చేస్తారు

జీవ రక్షణకు యోగ్యమైన వాతావరణంలో క్రికెట్‌ మిథ్య

ముంబయి: జీవ రక్షణకు యోగ్యమైన వాతావరణం (బయో సెక్యూర్‌ ఎన్విరాన్‌మెంట్‌)లో క్రికెట్‌ను పునరుద్ధరించడం మిథ్య అని టీమ్‌ఇండియా మాజీ సారథి రాహుల్‌ ద్రవిడ్‌ అన్నారు. ఇంగ్లాండ్‌, వేల్స్‌  క్రికెట్‌ బోర్డు విధానానికి ఆయన అంగీకరించలేదు.

త్వరలో జరిగే పాకిస్థాన్‌, వెస్టిండీస్‌ సిరీసులను జీవ రక్షణకు యోగ్యమైన వాతావరణంలో నిర్వహిస్తామని ఈసీబీ ప్రకటించిన నేపథ్యంలో ద్రవిడ్‌ స్పందించారు. అది కుదిరే పని కాదన్నారు. ‘ఈసీబీ చెబుతున్నది మిథ్యగా అనిపిస్తోంది. చాలా రోజుల్నుంచి సిరీసులేమీ జరగకపోవడంతో అలా ఆలోచిస్తోంది. ఒకవేళ వారు ఒక రక్షణ వలయం (బబుల్‌) సృష్టించి నిర్వహించినా అది ప్రతి ఒక్కరికీ సాధ్యమవ్వదు. ఎందుకంటే ఇప్పుడున్న షెడ్యూలు ప్రకారం నిరవధికంగా ప్రయాణాలు చేయాలి. ఎంతో మంది జనాలు ఇందులో భాగమవుతారు’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

‘పరీక్షలు, క్వారంటైన్‌ చేసి ఒకవేళ బయో బబుల్‌ సృష్టించినా టెస్టు మ్యాచు రెండో రోజు ఏ ఆటగాడికైనా పాజిటివ్‌ వస్తే ఏం చేస్తారు? ఇప్పుడున్న ప్రభుత్వ నిబంధనల ప్రకారమైతే మళ్లీ అందరినీ క్వారంటైన్‌లో ఉంచాల్సిందే. అప్పుడు టెస్టు మ్యాచు సాధ్యమవ్వదు. అప్పుడు మనం చేసిన ఖర్చులన్నీ వృథా అవుతాయి. ఒక ఆటగాడికి పాజిటివ్‌ వస్తే మొత్తం టోర్నీ రద్దవ్వకుండా ఏం చేయాలో ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి’ అని ద్రవిడ్‌ సూచించారు.

‘ప్రొఫెషనల్‌ స్థాయుల్లో క్రీడాకారులందరూ ప్రతి దానికీ అలవాటు పడాలి. ప్రదర్శనలపై ఇతర ప్రభావాలు పడనీయొద్దు. ఒకప్పటితో పోలిస్తే అనుభవం భిన్నంగా ఉంటుంది. అభిమానుల ముందు ఆడేందుకు ఆటగాళ్లు ఇష్టపడతారు. అదొక సంతృప్తి కలగజేస్తుంది. ఇప్పుడది కోల్పోయే పరిస్థితులు వచ్చాయి. క్రీడాకారులుగా కెరీర్‌లో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొంటాం. అన్నీ సవ్యంగా జరగవు. భయం, ఆందోళన కలుగుతాయి. అలాంటప్పుడు మనం నియంత్రించగలిగే వాటిపైనే దృష్టి సారించాలి’ అని ద్రవిడ్‌ వెల్లడించారు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.