సచిన్.. సారా.. సముద్రంలో‌ సరదా..!

తాజా వార్తలు

Updated : 11/12/2020 11:01 IST

సచిన్.. సారా.. సముద్రంలో‌ సరదా..!

ఇంటర్నెట్‌డెస్క్‌: క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ ప్రస్తుతం కుటుంబంతో సహా విహారయాత్రకు వెళ్లాడు. ఎక్కడికి వెళ్లాడనే సమాచారం చెప్పకపోయినా తన కుమారుడు, కుమార్తెతో కలిసి దిగిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నాడు. తొలుత తానొక్కడే సైక్లింగ్‌ చేస్తున్న ఫొటోలు పంచుకున్న లిటిల్‌ మాస్టర్‌.. ఆ తర్వాత కుమారుడు అర్జున్‌తో కలిసి దిగిన ఫొటోను పోస్టు చేశాడు. అనంతరం పారా సెయిలింగ్‌ చేస్తున్న వీడియోను షేర్‌ చేయగా.. తాజాగా సముద్రంలో తన గారాలపట్టి సారాతో కలిసి బోటింగ్‌కు వెళ్లిన సెల్ఫీని అభిమానులతో పంచుకున్నాడు. తండ్రీకూతుళ్లిద్దరూ లైఫ్‌ జాకెట్స్‌ ధరించి కళ్లద్దాలు పెట్టుకొని పడవలో వెళ్తుండగా ఆ ఫొటో తీసుకున్నారు. సచిన్‌ దాన్ని ఇన్‌స్టాలో పంచుకొని ఇలా పేర్కొన్నాడు. ‘‘సారా: బాబా.. మనం సముద్రంలో తప్పిపోయామా?’ అని అడిగితే.. నాకూ కచ్చితంగా తెలియదు’’ అని సరదాగా బదులిచ్చాడు. కరోనా కారణంగా మార్చిలో లాక్‌డౌన్‌ విధించినప్పటి నుంచీ ఇంట్లోనే ఉంటున్న సచిన్‌ ఇటీవలే బయటకు రావడం మొదలుపెట్టాడు.

ఇవీ చదవండి..

ఐపీఎల్‌ ఆర్జనలో ధోనీనే నం.1

మొతెరాలో మ్యాచ్‌ల మోతTags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని