close

తాజా వార్తలు

అమ్మో! సూపర్‌ ఓవర్లు మా మిత్రులు కావు: కేన్‌

హామిల్టన్‌: ‘సూపర్‌ ఓవర్లు న్యూజిలాండ్‌కు నిజంగా మిత్రులు కావు’ అంటున్నాడు కేన్‌ విలియమ్సన్‌. ముందుగానే తాము గెలుపు గీత దాటాలన్నాడు. ఉత్కంఠకరంగా సాగిన మూడో టీ20లో టీమ్‌ఇండియా విజయం సాధించిన తర్వాత అతడు మీడియాతో మాట్లాడాడు. ప్రపంచకప్‌ ఫైనల్లో ఇంగ్లాండ్‌తో సూపర్‌ ఓవర్‌ ఓటమి తర్వాత కివీస్‌ మళ్లీ అలాంటి ఓటమే బుధవారం చవిచూసింది.

‘సూపర్‌ ఓవర్లు నిజంగా మాకు మిత్రులు కావు (నవ్వుతూ). నిజాయతీగా చెప్పాలంటే మేం ముందుగానే గెలుపు గీత దాటాలి. సూపర్‌ ఓవర్‌ వరకు రానీయకూడదు. ఆ గీత మేం దాటకపోవడం సిగ్గుచేటు. ఎంతో శ్రమించిన తర్వాత ఓటమి వైపు ఉండటం నిరాశకలిగించింది. గత రెండు మ్యాచులతో పోలిస్తే మేం మరింత మెరుగయ్యాం. అది ఈ పోరులో కనిపించింది. టీమ్‌ఇండియా అద్భుతంగా పుంజుకుంది. ఏదేమైనప్పటికీ సూపర్‌ ఓవర్‌ అభిమానులకు ఉత్కంఠతో పాటు సరదా కలిగించింది. దీనిని వారు ఆస్వాదించారు’ అని కేఎన్‌ తెలిపాడు.

భారత్‌ నిర్దేశించిన 180 పరుగుల లక్ష్య ఛేదనలో విలియమ్సన్‌ తన ఆటతీరుకు భిన్నంగా ఆడాడు. విధ్వంసకరంగా ఆడుతూ 48 బంతుల్లోనే 95 పరుగులు చేశాడు. టీ20 కెరీర్‌లోనే ఒక ఇన్నింగ్స్‌లో ఎక్కువ సిక్సర్లు బాదేశాడు. బుమ్రా (0/45)ను ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా వ్యూహాలేమీ రచించలేదని అన్నాడు. ‘జట్టుకు ఏం అవసరమో అదే చేశాం. ఈ పిచ్‌పై ఆడటం కష్టంగా అనిపించింది. కానీ మంచి భాగస్వామ్యాలు నెలకొల్పాం. బుమ్రాను లక్ష్యంగా ఎంచుకోలేదు. మాకు ఓవర్‌కు 10 పరుగులు అవసరం. ఎక్కడికి పంపిస్తే పరుగులు వస్తాయో అక్కడికే బంతిని బాదాను. ఒత్తిడి పరిస్థితుల్లో టీమ్‌ఇండియాకు ఉన్న అనుభవం వారికి సాయపడింది. చిన్న చిన్న తేడాలతో మేం ఓటమి పాలయ్యాం. నిజమే! కాస్త భావోద్వేగం ఉంది. కానీ భారత జట్టు నాణ్యమైంది. మేం ముందుకు వెళ్లాల్సిందే’ అని విలియమ్సన్‌ అన్నాడు.

 



Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.