టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమ్‌ఇండియా

తాజా వార్తలు

Updated : 17/12/2020 09:12 IST

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమ్‌ఇండియా

అడిలైడ్‌: భారత్‌-ఆస్ట్రేలియా క్రికెట్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీకి సమయం ఆసన్నమైంది. మరికొద్దిసేపట్లో అడిలైడ్‌ వేదికగా ఇరు జట్లూ తొలి టెస్టులో తలపడనున్నాయి. ఈ సందర్భంగా టాస్‌ గెలిచిన టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. అయితే, ఇది పింక్‌ బాల్‌ టెస్టు కావడంతో ఉత్కంఠ మరింత పెరిగింది. ఇక గత పర్యటనలో కోహ్లీసేన 2-1 తేడాతో సిరీస్‌ గెలుపొంది ఆస్ట్రేలియాపై చారిత్రక విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా అలాంటి ప్రదర్శనే చేసి ఈ సిరీస్‌లో బోణీ కొట్టాలని చూస్తోంది. మరోవైపు ఆస్ట్రేలియా గత సిరీస్‌ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తొలి టెస్టు ఎలా సాగుతుందనే విషయంపై సర్వత్రా ఆసక్తి పెరిగింది.

ఆస్ట్రేలియా జట్టు: జో బర్న్స్‌, మాథ్యూ వేడ్‌, మార్నస్‌ లబుషేన్‌, స్టీవ్‌ స్మిత్‌, హెడ్‌,  గ్రీన్‌, టిమ్‌ పైన్‌ (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), పాట్‌ కమిన్స్‌, మిచెల్‌ స్టార్క్‌, హేజిల్‌వుడ్‌, లైయన్‌.

భారత జట్టు: మయాంక్‌ అగర్వాల్‌, పృథ్వీషా, ఛెతేశ్వర్‌ పుజారా, విరాట్‌ కోహ్లి (కెప్టెన్‌), అజింక్య రహానె, హనుమ విహారి, వృద్ధిమాన్‌ సాహా (వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్‌ అశ్విన్‌, ఉమేశ్‌ యాదవ్‌, మహ్మద్‌ షమి, జస్ప్రీత్‌ బుమ్రా.

ఇవీ చదవండి..

కోహ్లీ ‘అర్థరహితం’ × పైన్‌ ‘వెనకడుగు వేయం’

నయా భారత్‌కు నేను ప్రతినిధిని: కోహ్లీ


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని