మ్యాచ్‌కు ముందు శృంగారం చేయండి!

తాజా వార్తలు

Published : 02/07/2021 14:10 IST

మ్యాచ్‌కు ముందు శృంగారం చేయండి!

ధోనీసేనకు ప్యాడీ అప్టన్‌ భిన్నమైన సలహా

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎంత అనుభవం ఉన్నా.. ఎలాంటి ఆటగాడైనా.. ఎంత గొప్ప జట్టైనా.. ప్రపంచకప్‌ మ్యాచుల్లో ఆడుతుంటే కాస్త ఆందోళనగానే ఉంటుంది. క్రికెటర్ల మనస్సుల్లో భయం నెలకొంటుంది.

ఆ నెర్వస్‌నెస్‌ పోగొట్టుకొనేందుకు నిపుణులు, కోచ్‌లు ఇచ్చే సలహాలను ఆటగాళ్లు పాటించడం పరిపాటి. అయితే 2011 వన్డే ప్రపంచకప్‌ సమయంలో టీమ్‌ఇండియా ఆటగాళ్లకు అప్పటి మెంటల్‌ కండీషనింగ్‌ కోచ్‌ ప్యాడీ అప్టన్‌ ఓ వింత సూచన చేశాడట. మ్యాచులకు ముందు శృంగారంలో పాల్గొనాలని చెప్పాడట. దాంతో అప్పటి కోచ్‌ గ్యారీ కిర్‌స్టన్‌కు నోట మాట రాలేదట. ఏం చెప్పాలో తెలియక బిక్కమొహం వేశాడట.

ఈ విషయాలను ప్యాడీ అప్టన్‌ తన ఆత్మకథ ‘ది బేర్‌ఫూట్‌ కోచ్‌’ పుస్తకంలో పొందుపరచడం గమనార్హం. శృంగారం చేయాలన్న సలహా ఇచ్చినందుకు ఆ తర్వాత క్షమాపణ తెలియజేశానని అప్టన్‌ వివరించాడు. అంతేకాదు 2009 ఛాంపియన్స్‌ ట్రోఫీకి సిద్ధం చేసిన నోట్స్‌లోనూ శృంగారం వల్ల కలిగే లాభాలేంటో సవివరంగా రాశాడట. ‘శృంగారం చేయడం వల్ల మీ ప్రదర్శన మెరుగవుతుందా? అవును, పెరుగుతుంది’ అని ఆ నోట్స్‌లో రాసినట్టు పుస్తకంలో వెల్లడించాడు.

కోచ్‌గా ఉన్నప్పుడు చెప్పని విషయాలను ప్యాడీ అప్టన్‌ ఒక్కొక్కటిగా బయటకు వెల్లడిస్తున్నాడు. కాగా 2011 ప్రపంచకప్‌లో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. యువరాజ్‌ సింగ్‌ మెరుపులతో ధోనీసేన చిరకాల స్వప్నం నెరవేర్చుకుంది. భారత్‌కు మరోసారి ప్రపంచకప్‌ అందించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని