KL Rahul: కేఎల్‌ యాక్షన్‌.. అతియా రియాక్షన్‌

తాజా వార్తలు

Updated : 26/05/2021 12:43 IST

KL Rahul: కేఎల్‌ యాక్షన్‌.. అతియా రియాక్షన్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా స్ట్రోక్‌ప్లేయర్‌ కేఎల్‌ రాహుల్‌ వేగంగా కోలుకుంటున్నాడు. తేలికపాటి కసరత్తులు చేస్తున్నాడు. ఇంగ్లాండ్‌ పర్యటనకు సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో మూడు చిత్రాలను అతడు ఇన్‌స్టాలో పంచుకున్నాడు. వెంటనే అభిమానులంతా లైకుల వర్షం కురిపించారు. అంతేకాదు రాహుల్‌కు ఇష్టమైన స్నేహితురాలు అతియా శెట్టి సైతం ఓ వ్యాఖ్య పెట్టింది. దాంతో ఈ పోస్టు వైరల్‌గా మారింది.

కెటిల్‌ బాల్‌తో తేలికపాటి కసరత్తులు చేస్తున్న చిత్రాన్ని రాహుల్‌ పోస్ట్‌ చేశాడు. దాంతో పాటు సేదతీరుతున్న, క్యాండిడ్‌ చిత్రాలను పెట్టాడు. 'And still, We Rise’ అంటూ ఓ వ్యాఖ్య జత చేశాడు. ఎంతో మంది అతడి పోస్ట్‌కు స్పందించినప్పటికీ అతియా శెట్టి పెట్టిన  కామెంట్‌ మాత్రం వైరల్‌గా మారింది. ఆమె మరీ భిన్నంగా ఏం పెట్టలేదు. కేవలం స్మైలీనే పెట్టింది. వీరిద్దరూ చాలాకాలంగా సన్నిహితంగా ఉంటున్న సంగతి తెలిసిందే. బహుశా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారన్న ఊహాగానాలు ఉన్నాయి.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ తాజా సీజన్‌ ఆడుతుండగా కేఎల్‌ రాహుల్‌కు తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. స్కానింగ్‌ కోసం ఆస్పత్రికి తీసుకెళ్లగా అతడు అపెండిసైటిస్‌తో బాధపడుతున్నాడని తెలిసిందే. ఆ తర్వాత అతడు శస్త్రచికిత్స చేయించుకోవడంతో లీగ్‌కు దూరమయ్యాడు. ఇంతలోనే ఇంగ్లాండ్ పర్యటనకు సెలక్టర్లు టీమ్‌ఇండియాకు ఎంపిక చేశారు. కోలుకుంటేనే రాహుల్‌ ఇంగ్లాండ్‌కు వెళ్తాడని స్పష్టం చేశారు. అందుకు తగ్గట్టే రాహుల్‌ వేగంగా శక్తిని పుంజుకుంటున్నాడు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని