close

తాజా వార్తలు

Published : 16/04/2021 01:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కోహ్లీ, రోహిత్‌, బుమ్రాకు రూ.7 కోట్లు

2020-21 సీజన్‌కు బీసీసీఐ వార్షిక వేతనాలు..

(Photo: BCCI Twitter)

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా కాలంలోనూ టీమ్‌ఇండియా ఆటగాళ్ల వేతనాల్లో ఎలాంటి మార్పులు లేవు. 2020-21 సీజన్‌కు సంబంధించి బీసీసీఐ కొద్దిసేపటి క్రితమే ఆటగాళ్ల వార్షిక వేతనాలకు సంబంధించి ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో A+ గ్రేడ్‌ ఆటగాళ్లు అయిన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, ఓపెనర్‌ రోహిత్‌ శర్మతో పాటు ప్రధాన పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రాకు రూ.7 కోట్ల చొప్పున ప్రకటించింది. అలాగే A గ్రేడ్‌ ఆటగాళ్లకు రూ.5 కోట్లు, B గ్రేడ్‌ ఆటగాళ్లకు రూ.3 కోట్లు, C గ్రేడ్‌ ఆటగాళ్లకు రూ.కోటి చొప్పున బీసీసీఐ ట్వీట్‌ చేసింది.

* A+ గ్రేడ్‌ : విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, జస్ప్రీత్‌ బుమ్రా

* A గ్రేడ్‌: రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, ఛెతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానె, శిఖర్‌ ధావన్‌, కేఎల్‌ రాహుల్‌, మహ్మద్‌ షమి, ఇషాంత్‌ శర్మ, రిషభ్‌ పంత్‌, హార్దిక్‌ పాండ్య,

* B గ్రేడ్‌: వృద్ధిమాన్‌ సాహా, ఉమేశ్‌ యాదవ్‌, భువనేశ్వర్‌ కుమార్‌, శార్దూల్‌ ఠాకూర్‌, మయాంక్‌ అగర్వాల్‌

* C గ్రేడ్‌: కుల్‌దీప్‌ యాదవ్‌, నవ్‌దీప్‌సైని, దీపక్‌ చాహర్‌, శుభ్‌మన్‌ గిల్‌, హనుమ విహారి, అక్షర్‌ పటేల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, వాషింగ్టన్‌ సుందర్‌, యుజువేంద్ర చాహల్‌, మహ్మద్‌ సిరాజ్‌


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని