
తాజా వార్తలు
రోహిత్‌ను సరదాగా ట్రోల్ చేసిన డీకే
ఇంటర్నెట్‌డెస్క్: టీమ్ఇండియా సీనియర్ బ్యాట్స్‌మన్, వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్.. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మను సరదాగా ట్రోల్ చేశాడు. గబ్బా టెస్టులో శుక్రవారం భారత పేసర్ నవ్‌దీప్ సైని బౌలింగ్ చేస్తూ గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో అతడు మధ్యలోనే మైదానం వీడాడు. ఆ ఓవర్లో ఒక బంతి మిగిలిపోవడంతో కెప్టెన్ రహానె బంతిని రోహిత్‌కు అందించాడు. రోహిత్ వేసిన ఆ బంతిని ఎదుర్కొన్న మార్నస్ లబుషేన్(108) కట్‌షాట్ ఆడి సింగిల్ తీశాడు.
అయితే, రోహిత్ బౌలింగ్ చేయడాన్ని దినేశ్ కార్తిక్ సరదాగా ట్వీట్ చేశాడు. టీమ్ఇండియా ప్రధాన పేసర్లు.. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి రోహిత్‌ను చూసి నేర్చుకోవాలన్నాడు. జట్టులో కొత్త ఫాస్ట్ బౌలర్ వచ్చాడంటూ ముగ్గుర్నీ ట్యాగ్ చేసి ఓ జిఫ్ఫైల్ను పోస్టు చేశాడు. తర్వాత ఏమైందో తెలియదు కానీ డీకే ఆ పోస్టును తొలగించాడు. అప్పటికే అది వైరల్‌గా మారింది. మరోవైపు సైని గాయంపై ఇంకా స్పష్టత రాలేదు. అతడిని వైద్య పరీక్షలకు తరలించినట్లు బీసీసీఐ శుక్రవారం ట్వీట్ చేసింది. అలాగే మూడో టెస్టులో గాయపడిన హనుమ విహారి భారత్‌కు తిరుగు పయనమయ్యాడు.
ఇవీ చదవండి..
శతకం చేశాక సెలబ్రేట్ చేసుకోను: లబుషేన్
అభిమానుల దుశ్చర్య:సిరాజ్‌పై వ్యాఖ్యలు