Mohammed Siraj: సిరాజ్‌ ష్‌..! సైగల వెనుక అసలు కారణం ఇదే!

తాజా వార్తలు

Published : 16/08/2021 01:48 IST

Mohammed Siraj: సిరాజ్‌ ష్‌..! సైగల వెనుక అసలు కారణం ఇదే!

లండన్‌: ఇంగ్లాండ్‌-భారత్‌ మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా ఫాస్ట్‌బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌ నాలుగు వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు. అయితే, నాటింగ్‌హామ్‌లో జరిగిన తొలి టెస్టులో, ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్టులో మునుపెన్నడూ లేనంత దూకుడుగా ప్రవర్తిస్తున్నాడు. వికెట్ తీసిన ప్రతిసారి నోటి మీద వేలు ఉంచి ‘ష్..’అంటూ సైగలు చేస్తున్నాడు.

కాగా, ఈ సైగల వెనకున్న అసలు విషయాన్ని రెండో టెస్టు మూడో రోజు ఆట ముగిసిన అనంతరం సిరాజ్‌ బయటపెట్టాడు. ‘‘నన్ను విమర్శించే వారినుద్దేశించి ఈ రకంగా సంబరాలు చేసుకుంటున్నా. ఎందుకంటే వారికి నా గురించి ఎన్నో ఆలోచనలుంటాయి. అవి ఎలాంటివంటే.. ‘అతడి వల్ల ఇది సాధ్యం కాదు..’ ‘అలా చేయలేడు.’ కాబట్టి నా బంతితో మాత్రమే సమాధానం చెబుతా. సంబరం చేసుకోవడంలో ఇది నా కొత్త స్టైల్‌’’ అని సిరాజ్‌ అన్నాడు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని