చెన్నై టెస్టు: టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌
close

తాజా వార్తలు

Published : 05/02/2021 09:07 IST

చెన్నై టెస్టు: టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: మరికొద్దిసేపట్లో టీమ్‌ఇండియాతో ప్రారంభమయ్యే తొలి టెస్టులో ఇంగ్లాండ్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. కెరీర్‌లో వందో టెస్టు ఆడుతున్న ఆ జట్టు సారథి జో రూట్‌ తొలుత బ్యాటింగ్‌ చేయడానికే మొగ్గు చూపాడు. మరోవైపు ఆస్ట్రేలియా పర్యటనలో తొలి టెస్టు తర్వాత పితృత్వపు సెలవులు తీసుకున్న కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తిరిగి సారథ్య బాధ్యతలు చేపట్టాడు. కాగా, ఇరు జట్లూ ఈ టెస్టుకు ముందు విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. టీమ్‌ఇండియా ఆస్ట్రేలియాను ఓడించగా.. ఇంగ్లాండ్‌ శ్రీలంకపై విజయం సాధించింది. దీంతో రెండు జట్లూ సమానంగా కనిపిస్తున్నాయి.

ఇక ఈ సిరీస్‌ టీమ్‌ఇండియాతో పాటు ఇంగ్లాండ్‌ జట్టుకూ ఎంతో కీలకం కానుంది. ఇప్పటికే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు న్యూజిలాండ్‌ అర్హత సాధించగా, మిగిలిన స్థానానికి భారత్‌, ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా జట్లు పోటీపడుతున్నాయి. ఈ క్రమంలోనే ఫైనల్లో టీమ్‌ఇండియా కివీస్‌తో పోటీపడాలంటే ఈ సిరీస్‌ను 2-0 లేదా అంతకన్నా ఎక్కువ తేడాతో గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో కోహ్లీసేన ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉంది. 

భారత్‌: రోహిత్‌, గిల్‌, పుజారా, కోహ్లి (కెప్టెన్‌), రహానె, పంత్‌, సుందర్‌, అశ్విన్‌, ఇషాంత్‌, బుమ్రా, షాబాజ్‌ నదీమ్‌   

ఇంగ్లాండ్‌: బర్న్స్‌, సిబ్లీ, లారెన్స్‌, రూట్‌ (కెప్టెన్‌), స్టోక్స్‌, ఓలీ పోప్‌, బట్లర్‌, బెస్‌, ఆర్చర్‌, జాక్‌ లీచ్‌, అండర్సన్‌  

ఇవీ చదవండి..
యాష్‌తో మినీ సమరం..పుజారా భారీ వికెట్‌
కోహ్లీ 31లోనైనా 71 చేరుకుంటాడా?


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని