
తాజా వార్తలు
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్
అహ్మదాబాద్: మొతేరా వేదికగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య మరికొద్దిసేపట్లో నాలుగో టెస్టు ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ జోరూట్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కాగా, ఈ సిరీస్‌లో ఇప్పటికే 2-1 ఆధిక్యంలో కొనసాగుతున్న టీమ్ఇండియా ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌కు చేరాలని ఆశిస్తోంది. మరోవైపు ఇంగ్లాండ్ ఇక్కడ గెలిచి సిరీస్ డ్రా చేసుకోవాలని పరితపిస్తోంది. ఇక ఇదే వేదికపై జరిగిన పింక్‌బాల్ టెస్టు రెండు రోజుల్లోనే ముగీయడంతో ఈ మ్యాచ్ ఎలా సాగుతుందనే విషయంపై ఆసక్తి కలుగుతోంది.
భారత జట్టు: రోహిత్ శర్మ, శుభ్‌మన్‌గిల్, చెతేశ్వ పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానె, రిషభ్‌పంత్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, ఇషాంత్ శర్మ, మహ్మద్ సిరాజ్
ఇంగ్లాండ్ జట్టు: డొమినిక్ సిబ్లీ, జాక్ క్రాలే, జానీ బెయిర్‌స్టో, జోరూట్ (కెప్టెన్), బెన్‌స్టోక్స్, ఓలిపోప్, బెన్‌ఫోక్స్, డానియల్ లారెన్స్, డొమినిక్ బెస్, జాక్‌లీచ్, జేమ్స్ అండర్సన్