Greg Chappell: గంగూలీ కష్టపడేవాడు కాదు 

తాజా వార్తలు

Updated : 21/05/2021 09:59 IST

Greg Chappell: గంగూలీ కష్టపడేవాడు కాదు 

దిల్లీ: భారత జట్టుకు కోచ్‌గా తన రెండేళ్ల (2005-2007) కాలంలో ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువైన గ్రెగ్‌ ఛాపెల్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. అప్పటి కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ తన ఆట మెరుగుపర్చుకోవడానికి కష్టపడేవాడు కాదని, కేవలం కెప్టెన్‌గా మాత్రమే జట్టులో ఉండేందుకు ఇష్టపడేవాడని అతనన్నాడు. ఛాపెల్‌ను కోచ్‌గా ఎంపిక చేయడంలో గంగూలీదే కీలక పాత్ర కావడం గమనార్హం. ‘‘భారత జట్టుకు కోచ్‌గా ఉండాలని నన్ను గంగూలీ సంప్రదించాడు. అతని వల్లే టీమ్‌ఇండియాకు కోచ్‌గా పనిచేసే అవకాశం దక్కింది. అయితే కోచ్‌గా నా రెండేళ్ల కాలంలో ప్రతి క్షణం సవాలుగా గడిచింది. జట్టుపై అంచనాలు ఎక్కువగా ఉండేవి. గంగూలీ కెప్టెన్‌గా ఉండడంతో కొన్ని సమస్యలు వచ్చాయి. అతను కష్టపడాలనుకోలేదు. తన ఆటను మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నించలేదు. కేవలం కెప్టెన్‌గా మాత్రమే జట్టులో ఉండాలనుకున్నాడు. అలా అయితే పరిస్థితులను నియంత్రించవచ్చు కదా. ప్రపంచంలో భారత్‌ అత్యుత్తమ జట్టుగా ఎదగడంలో ద్రవిడ్‌ కీలక పాత్ర పోషించాడు. కానీ జట్టులోని మిగతా ఆటగాళ్లకు అలాంటి భావన లేకపోవడం నిరాశ కలిగించింది. వాళ్లు జట్టులో ఉండడంపైనే దృష్టి పెట్టారు. అయితే గంగూలీని జట్టు నుంచి తప్పించిన తర్వాత మిగతా సీనియర్‌ ఆటగాళ్లు జాగ్రత్తపడ్డారు. జట్టు మార్పు కోరుకోలేదు. కాబట్టి రెండేళ్ల పదవీ కాలం ముగిశాక నన్ను కోచ్‌గా కొనసాగమని అడిగినా అందుకు నేను ఒప్పుకోలేదు’’ అని ఛాపెల్‌ పేర్కొన్నాడు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని